గురువారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జూలూరుపాడు మండలం లోని గ్రామపంచాయతీలను సందర్శించారు
ముందుగా చింతల్ తండ గ్రామపంచాయతీలో మునగ మొక్కను నాటారు. ప్లాంటేషన్ లో భాగంగా మునగ మొక్కలు పంట వేసిన రైతు ముఖ్య దేవాను అభినందించారు. అనంతరం బేతాళుపాడు గ్రామపంచాయతీ సందర్శించి ఇంకుడు గుంతల నిర్మాణం, అజోల్ల పెంపకం పరిశీలించిసంతృప్తి వ్యక్తం చేశారు. రేగళ్ల తండా గ్రామంలోని ఎంపీపీ ఎస్ పాఠశాల భవనం పూర్తిస్థాయి రిపేరు చేయవలసి ఉన్నందున ప్రతి పాదనలు సిద్ధం చేయవలసిందిగా అధికారులు ఆదేశించారు. మాచినపేట తండా ప్రాథమిక పాఠశాల తనిఖీ చేసి పాఠశాల పైకప్పు కురుస్తున్నందున రిపేరు చేయించుటకు తగిన ప్రతిపాదన సిద్ధం చేయవలసిందిగా ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మాచినపేట తండాలో ఇంకుడు గుంతలను పరిశీలించారు. అనంతరం కొమ్ముగూడెం గ్రామంలోని పశువుల ఆసుపత్రి భవనాన్ని తనిఖీ చేశారు. ఆస్పత్రి భవనం శిథిలవసలోనందున ప్రభుత్వానికి వెంటనే ప్రతిపాదనలు పంపి నిధులు మంజూరు కాగానే ప్రాతిపదికన ఆస్పత్రి భవనం నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, జూలూరుపాడు ఎంపీడీవో, కొమ్ముగూడెం పశువైద్య ఉపకేంద్రం బానోత్ బద్దులాల్, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.