ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ ఋణ మాఫీ చేయాలి....

Aug 22, 2024 - 18:25
Aug 22, 2024 - 18:25
 0  5

మాజీ జడ్పీటీసీ,జిల్లా బిఆర్ఎస్ నాయకులు బాసు శ్యామల,హనుమంతు నాయుడు*

రైతులందరూ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఎదురుగా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం...

ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఎదురుగా ఎలాంటి ఆంక్షలు లేకుండా గద్వాల్ నియోజకవర్గం రైతులందరూ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు... బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు లతో కలిసి,బాసు శ్యామల, హనుమంతు నాయుడు పాల్గొని, రైతులతో కలిసి అధికారులకు వినతి పత్రాలు అందజేశారు...

ఈ సందర్భంగా బాసు శ్యామల,హనుమంతు నాయుడు మాట్లాడుతూ...

రాష్ట్రంలో  40శాతం మంది రైతన్నలకు కూడా రుణమాఫీ కాలేదు అని సిఎం రుణ మాఫీ పూర్తయిందని చెబుతుంటే.. మంత్రులు మనిషికో మాట చెబుతూ రైతులను అయోమయానికి గురిచేస్తున్నారు అని అన్నారు...ఈ దగా ప్రభుత్వంలో అనేక  ఆంక్షలు పెట్టి రైతన్నలను మోసం చేసినందుకు రాష్ట్రప్రభుత్వం రైతులకు క్షమాపణలు చెప్పాలి అని అన్నారు.అందరికీ వెంటనే రుణ మాఫీ చేయాలని అప్పటిదాక ప్రభుత్వంపై బిఆర్ఎస్ పార్టీ పోరాటం ఆగదని ఆయన హెచ్చరించారు.రెండు లక్షల వరకు అందరికీ రుణ మాఫీ అయిందని ముఖ్యమంత్రి చెబుతుంటే ....మంత్రులు మాత్రం ఇంకా రుణ మాఫీ కార్యక్రమం కొనసాగుతుంది అని చెబుతున్నారని అన్నారు.ఎన్నికల ముందు రుణ మాఫీ అందరికీ వర్తింపజేస్తామని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసిందని గుర్తుచేశారు.ఎన్నికలు కాగానే రుణ మాఫీ కోసం 40వేల కోట్లు అవసరమని సిఎం చెప్పారని కానీ క్యాబినెట్ మాత్రం కేవలం 31 వేల కోట్లకు మాత్రమే అనుమతి ఇచ్చింది అన్నారు.బడ్జెట్లో 26 వేల కోట్లు కేటాయించి కేవలం 18వేల కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు.రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ప్రభుత్వం కళ్ళు తేరుచాలని వారు అన్నారు.రైతులకు న్యాయం చేసే వరకు పోరాడుతామని అన్నారు....

అంతక ముందు,
      ???? తెలంగాణ తల్లి పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గద్వాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు...


ఈ కార్యక్రమంలో నాగర్ దొడ్డి వెంకట రాములు,కురువ విజయ్ కుమార్, పటేల్ జనార్దన్ రెడ్డి,ఏన్.జయరాం రెడ్డి, గుమ్మ గోవర్ధన్,టవర్ ముక్బాల్,బీచ్పల్లి ముని,రంగు మద్దిలేటి, శ్రీనివాస్,మల్లికార్జున్,వినోద్,బాసు గోపాల్,సత్యారెడ్డి, తిమ్మప్ప గౌడ్,బాసు బొజ్జయ్య,పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.....

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333