గురుకుల పాఠశాలలో సందర్శించిన వైద్య ఆరోగ్య సిబ్బంది
జోగులాంబ గద్వాల 29 జూలై 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఇటిక్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇటిక్యాల డాక్టర్ రాధిక మరియు సూపర్వైజర్ వెంకటేష్ హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాసులు ఏఎన్ఎం ఎలిజిబెత్ విశ్వనాథమ్మ మరియు ఆశ వర్కర్స్ అందరూ కలిసి ఇటిక్యాల గ్రామంలోని గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థుల కు ఆరోగ్య పరీక్షలు జరిపారు ఇందులో మొత్తం స్కూలు విద్యార్థులు 445 మంది గాను 111 మంది విద్యార్థులకు చికిత్స అందించారు ఇందులో దగ్గు పడిశం తలనొప్పి అలర్జీ మరియు 10 మంది జ్వరము విద్యార్థులను కూడా పరీక్షించడం జరిగింది.
ఈ స్కూలు ప్రిన్సిపల్ ఈ సురేష్ మా వైద్య సిబ్బందికి సహకరించారు మరియు విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత గురించి మరియు ఆరోగ్య విద్యను, హ్యాండ్ వాష్ గురించి విద్యార్థులకు తగు సూచనలు ఇచ్చారు మరియు విద్యార్థులకు ఏమైనా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినచో వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నాకు రావాలని సూచించారు.