మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ (MLHPs)కి ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష సమావేశం.

May 30, 2024 - 19:39
 0  13
మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ (MLHPs)కి ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష సమావేశం.
మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ (MLHPs)కి ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష సమావేశం.

జోగులాంబ గద్వాల 30 మే 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల. జిల్లా కేంద్రంలోని  తేదీ 30.5.2024 న పాత జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. శశికళ  మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ (MLHPs) * కి అన్ని ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు....  MLHPs అందరూ , హెల్త్ అండ్ వెల్నెస్ (Health and well ness centre ) సెంటర్ పరిధిలోని ప్రజలందరికీ  అన్ని రకాల ఆరోగ్య సేవలు  అందించాలని ఆదేశించారు.. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, శిశువులకు తప్పనిసరిగా మాత శిశు సంరక్షణ సేవలు అందించాలని మరియు అందించిన సేవలు అన్ని ఆన్లైన్ చేయాలని కోరారు.. **0 - 5 సంవత్సరాల లోపు పిల్లలకు అందరికీ వ్యాధి నిరోధక టీకాలు వేయాలని మరియు  ఇమ్యునైజేషన్ రిజిస్టర్ , డ్యూ లిస్ట్ రిజిస్టర్ సక్రమంగా నిర్వర్తించాలని కోరారు..  షుగర్ వ్యాధిగ్రస్తులకు మరియు బీపీ వ్యాధిగ్రస్తులకు నెలవారీగా క్రమం తప్పకుండా మెడిసిన్స్ అందించాలని , వ్యాధి ముదిరిన రోగుల ను పాలియేటివ్ కేర్ మొదలగు సేవల కొరకు జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేయాలని.. కోరారు. అనుమానిత  క్షయ వ్యాధి రోగులను టిబి యూనిట్ కి రెఫర్ చేయాలని...   మానసిక వ్యాధి రోగంతో బాధపడే రోగులను కూడా జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేయాలని తెలిపారు..  ప్రతి శుక్రవారం డ్రైడే సర్వేని నిర్వహించి ప్రజలకు మలేరియా ,డెంగు వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.. అన్ని రకాల ఆరోగ్య కార్యక్రమాల కు సంబంధించిన రికార్డుల నిర్వహణ సక్రమంగా నిర్వర్తించాలని మరియు అన్ని రకాల ఆరోగ్య కార్యక్రమాలను ప్రతిరోజు ఆన్లైన్ చేసి జోగులాంబ గద్వాల జిల్లా,  ను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిల్పాలని ఆదేశించారు...  ఈ సమీక్ష సమావేశంలో జిల్లా ఉప - వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్. ఎస్.కె సిద్ధప్ప మరియు డాక్టర్. రాజు మరియు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వైద్య సిబ్బంది కే. మధుసూదన్ రెడ్డి, నరేంద్రబాబు, మాధవి, రామాంజనేయులు, సాదిక్, రాజ్ కుమార్ కళ్యాణి.. పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333