గద్వాల:- జిల్లాలోని పలు గ్రామాలకు వెళ్లే దారుల్లో అండర్ పాస్ రైల్వే బ్రిడ్జిలు ప్రమాదకరంగా మారాయి

Sep 6, 2024 - 19:53
Sep 6, 2024 - 19:54
 0  6
గద్వాల:- జిల్లాలోని పలు గ్రామాలకు వెళ్లే దారుల్లో అండర్ పాస్ రైల్వే బ్రిడ్జిలు ప్రమాదకరంగా మారాయి

చిన్నపాటి వర్షం కురిసిన పది అడుగుల:-మేరకు రైల్వే ట్రాక్ తగిలే విధంగా నీళ్లు నిలుచుంటున్నాయి.అటుగా వెళ్లే గ్రామాలకు దారులు పూర్తిగా స్తంభించిపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ వర్షాకాలం సీజన్ లో నెలరోజులు గడిచిన రైల్వే అండర్ పాస్ బ్రిడ్జిల దగ్గర నీళ్లు మాత్రం బయటకు పోవడం లేదు. ఇటిక్యాల, వల్లూరు, నారాయణపురం గ్రామాలకు వెళ్లే ప్రధాన దారులు పూర్తిగా స్తంభించిపోయాయి. అండర్ పాస్ బ్రిడ్జిలు మునిగి పోయేలా వర్షపు నీళ్ళు నిలిచిపోయాయి. గత వారం కిందట జిల్లా కలెక్టర్ మండల అధికారులు పరిశీలించిన, బ్రిడ్జి కింద నిలిచిన వర్షపు నీటిని మాత్రం ఇంకా తోడేయలేదు.దీంతో ఆ గ్రామాల ప్రజల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. అండర్ బ్రిడ్జిలు నిర్మాణం లేనప్పుడే బాగుండేదని... ట్రాక్ పై రైలు వెళ్లే వరకు నిల్చొని మా గ్రామాలకు చేరుకునే వాళ్ళమని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. రైల్వే అండర్ బ్రిడ్జిల దగ్గర నీళ్లు నిల్వకుండా చూడాలని, లేదంటే పాత పద్ధతిలోనే ట్రాక్ పై వెళ్లే విధంగా మార్గం ఏర్పాటు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఒకవైపు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి, మరోవైపు రైల్వే అండర్ బ్రిడ్జిల్లా దగ్గర వర్షపు నీరు ఉండడంతో ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి ఉందని అంటున్నారు. కేంద్ర మంత్రులు, రాష్ట్ర స్థాయి పాలకులు స్పందించి ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని ఆయా గ్రామాల ప్రజలు రైతులు కోరుతున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333