వ్యవసాయ పొలంలో భారీ మొసలి లభ్యం
జోగులాంబ గద్వాల 11 మార్చి 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ధరూర్ మండలంలోని ర్యాలంపాడు గ్రామ శివారులో గల వ్యవసాయ పొలంలో భారీ మొసలిని సోమవారం గ్రామస్తులు గుర్తించారు. ర్యాలంపాడు రిజర్వాయర్ లో నీళ్లు అడుగంటడంతో రిజర్వాయర్ నుంచి గ్రామ శివారులో గల రంగారెడ్డి అనే రైతు వ్యవసాయ పొలంలో ముండ్ల చెట్ల పొదలలో మొసలి ప్రత్యక్షమైంది.స్థానికులు చూసి భయాందోళనకు గురై వెంటనే డీఎఫ్‌వో అధికారులకు సమాచారం అందించారు. వారు మొసలిని బంధించి జూరాల ప్రాజెక్టులో విడిచిపెట్టారు. మొసలి బరువు 130 కిలోల వరకు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.