గంజాయి సప్లయర్ రిమాండ్

Jan 21, 2026 - 15:00
 0  661
గంజాయి సప్లయర్ రిమాండ్

  మోత్కూర్ 21 జనవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

గంజాయి సరఫరా కేసులో గత కొంతకాలంగా పోలీసులను తప్పించుకుంటూ పరారీలో ఉన్న నిందితుడు మహేష్‌ను యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు మోత్కూరు ఎస్సై . వెంకటేశ్వర్లు తెలిపారు.ఈ నెల 4వ తేదీన మున్సిపాలిటీ పరిధిలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో, స్థానిక యువకుడు సందీప్‌కు గంజాయి సరఫరా చేసేందుకు ఓ వ్యక్తి వస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సందీప్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అయితే, ప్రధాన సప్లయర్ మహేష్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు.పరారీలో ఉన్న మహేష్ కోసం గాలింపు చేపట్టిన పోలీసులు, అతను భువనగిరి జిల్లా ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మహేష్‌పై ఇదివరకే భువనగిరిలో పలు కేసులు నమోదైనట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.మహేష్ అరెస్టుతో గంజాయి రవాణా వెనుక ఉన్న నెట్‌వర్క్‌ను పూర్తిగా ఛేదించే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి విక్రయం లేదా రవాణా చేసిన పక్షంలో కఠిన చర్యలు తప్పవని ఇన్స్పెక్టర్ ఈ సందర్భంగా హెచ్చరించారు..... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి