గురుకులాల విషయంలో భట్టి కీలక ఆదేశాలు
గురుకుల పాఠశాలల విషయంలో డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇకపై గురుకుల కార్యదర్శి రోజూ ఒక పాఠశాలను పరిశీలించాలని ఆదేశించారు.
మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నాణ్యతతో కూడిన విద్యాబోధన, సౌకర్యాల కల్పన వంటి అంశాలపై ఆ శాఖ కార్యదర్శులతో భట్టి విక్రమార్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గురుకుల పాఠశాలల భవనాల అద్దె చెల్లింపునకు నిధులు వెంటనే విడుదల చేయాలన్నారు. అద్దె భవనాల యజమానులతో మాట్లాడి అన్ని సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గురుకుల కార్యదర్శి క్షేత్ర స్థాయి పరిశీలన వివరాలతో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.