అర్ధరాత్రి డివైడర్ ను ఢీకొని టవేరా బోల్తా - ఇద్దరు వృద్దులకు తీవ్రగాయాలు,ఐదు మందికి స్వల్పగాయాలు
మానవత్వం చాటుకున్న ఉప సర్పంచ్ ల సంఘం మాజీ జిల్లా అధ్యక్షుడు పాల్వాయి ఎస్ రంజిత్ కుమార్ & మిత్రబృందం.
అంబులెన్స్ కు,పోలీసులకు సమాచారం ఇచ్చి - దగ్గరుండి క్షతగాత్రులను మహబూబ్ నగర్ జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలింపు
మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం కాటవరం గ్రామ స్టేజి సమీపంలో తెల్లవారుజామున 3: 30 నిముషాల వ్యవధిలో నంద్యాల జిల్లా గుత్తి నియోజకవర్గం చిన్న ఒడుగూరు గ్రామానికి చెందిన ప్రమాదానికి గురియైన క్షతగాత్రులు రామాంజనేయులమ్మ వయసు (60) మా కుటుంబ సభ్యులు దైవదర్శనం నిమిత్తమై తమ స్వగ్రామం నుండి దైవ దర్శనం నిమిత్తమై ఆదివారం తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలోని శ్రీ రామాలయం,నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో నేషనల్ హైవే రోడ్డు 44 మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం కాటవరం గ్రామ స్టేజీ సమీపంలో నిద్రమత్తులో జారుకున్న డ్రైవర్ ఒకసారిగా డివైడర్ ఢీకొని టవేర కార్ నెంబర్ AP 16DH 1199 గల టవేరా ఒక్కసారిగా పల్టీలు కొట్టి, కుడివైపున ఉన్న రోడ్డుపై ఎగిరిపడి ప్రమాదానికి గురి అయ్యింది. అందులో ప్రయాణిస్తున్న రామాంజనేయులమ్మ వయసు( 60), రామలక్ష్మి వయసు (65) సంవత్సరాలు,మిగతా ఐదు మందికి స్వల్ప గాయాలయ్యాయి.ఇదే రోడ్డు మార్గాన అర్థరాత్రి హైదరాబాద్ నుండి గద్వాల్ కు ప్రయాణిస్తున్న ఉప సర్పంచ్ ల సంఘం మాజీ జిల్లా అధ్యక్షుడు పాల్వాయి రంజిత్ కుమార్ తన మిత్రబృందం పాల్వాయి ప్రసాద్,ఓరుగల్లు 9న్యూస్ రిపోర్టర్ బిజ్వారం ఎస్. తిరుమలేష్,ఎల్కూరు శ్యామ్ రాజ్, సలీమ్ లు గమనించి అంబులెన్స్ కు సమాచారం ఇచ్చి ప్రమాద స్థల ఘటనలో దగ్గరుండి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం ఏరియా ఆసుపత్రికి తరలించారు.