- గంజాయి రవాణా, వినియోగం కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసిన కోదాడ పట్టణ పోలీసు. ఇద్దరు పరారి.

Mar 11, 2025 - 20:15
 0  9
- గంజాయి రవాణా, వినియోగం కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసిన కోదాడ పట్టణ పోలీసు. ఇద్దరు పరారి.

- అరెస్టు చేసిన నిందితుల వద్ద నుండి రూ.1,00,000/- విలువ గల 9 కే‌జి ల 860 గ్రాముల గంజాయి, ఐదు  సెల్ ఫోన్లు స్వాధీనం.
జిల్లా పోలీసు కార్యలయం నందు మీడియా సమావేశం నంధు కేసు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ K.నరసింహ IPS గారు.

- గంజాయి సరఫరా చేసేవారి, వినియోగిస్తున్న వారి సమాచారాన్ని ఇవ్వాలి.
- సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాము.
- సమాజంలో డ్రగ్స్ నిర్మూలనలో పౌరులు, ప్రజలు బాగస్వామ్యం కావాలి.
- అలవాటుగా గంజాయి సరఫరా చేసేవారిపై సామాజిక భద్రతలో భాగంగా PD యాక్ట్ నమోదు చేసి ఎక్కువరోజులు జైలులో ఉండాలా కృషి చేస్తాం.

..... K.నరసింహ IPS, ఎస్పీ సూర్యాపేట జిల్లా.

జిల్లా ఎస్పీ నర్సింహా IPS గారు ఈరోజు జిల్లా పోలీసు కార్యలయం నందు అధనపు ఎస్పీ నాగేశ్వరావు, కోదాడ డివిజన్ DSP శ్రీధర్ రెడ్డి, కోదాడ పట్టణ ఇన్స్పెక్టర్ రాము తో కలిసి మీడియా సమావేశం నంధు కేసు వివరాలు వెల్లడించారు. ఎస్పీ గారు మాట్లాడుతూ ఆంద్రా కృష్ణ జిల్లాకు చెందిన A1 నింధితుడు మల్లెడ వెంకట వంశీ  మరియు A2 గోకులముడి ఆనంద్ అనే వ్యక్తులు ఆంద్ర, ఒరిస్సా బార్డర్ నుంచి గంజాయిని తక్కువకు తీసుకువచ్చి చిన్న చిన్న పాకెట్ లు చేసి ఈ పాకెట్లను హైదరాబాద్ లో గంజాయి అలవాటు ఉన్న వారికి అమ్మి ఎక్కువ డబ్బులు సంపాదించాలని  నిశ్చయించుకుని NTR కృష్ణ జిల్లా పెనమూరు మండలానికి చెందిన A3 నింధితుడు చొరగుడి తేజ తో కలిసి విజయవాడ నుండి హైదరాబాద్ కు బస్ లో  వెళ్తూ మార్గ మద్యలో అనగా కోదాడ శివారులోని ఉన్న దుర్గాపురం X రోడ్ వద్ద బస్ దిగి  రోడ్ ప్రకన ఉన్న మామిడి తోట లోకి సంపత్, హేమన్ నర్సింహా సాయి, కృష్ణ చైతన్య, భాస్కర్ లతో కలిసి వెళ్ళి వారికి గంజాయి త్రాగడానికి ఇస్తుండగా నమదగిన సమాచారం పై తేది 10-03-2025 రోజున మద్యాహ్నం 1 గంట సమయంలో కోదాడ టౌన్ ఎస్‌ఐ సైదులు వారిని పట్టుకున్నారు. ఇట్టి కేసులో A1 మల్లెడ వెంకట వంశీ మరియు A2 గోకులముడి ఆనంద్ అనే వ్యక్తులు పరారీలో ఉన్నారు అని ఎస్పీ గారు తెలిపినారు. పరారీలో ఉన్న ఇద్దరు నింధితులను పట్టుకోవడానికి పోలీస్ తీమ్స్ ఏర్పాటు చేశామని ఎస్పీ గారు అన్నారు. గంజాయి విలువ 1,00,000/- మరియు ఐదు సెల్ ఫోన్ల విలువ సుమారు 60,000/- మొత్తం విలువ 1,60,000/- రూపాయలు  ఉంటుందని అంచనా వేయడం జరిగింది.  
    గంజాయి సంబంధించిన కేసుల్లో నిందితులు అలవాటుగా ఇలాంటి నేరాలకు పాల్పడితే సామాజిక రక్షణలో భాగంగా PD యాక్ట్ నమోదు చేసి ఎక్కువరోజులు జైలులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటాం అని ఎస్పి గారు తెలిపినారు. గంజాయి సరఫరా చేసిన వినియోగించిన అది చట్టపరమైన నేరము, దీనికి సంభందించి పౌరులు, ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలి డయల్ 100 కు లేదా స్థానిక పోలీసులకు తెలుపవచ్చు, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని ఎస్పి గారు అన్నారు. డ్రగ్స్, గంజాయి నిర్మూలన కోసం జిల్లా పోలీస్ శాఖ ప్రజలతో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అలాగే విద్యాసంస్థల్లో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాము గంజాయి నిర్మూలనలో ప్రజలు పౌరులు అందరూ భాగస్వామ్యం కావాలని పోలీసులకు సహకరించాలని ఎస్పీ గారు కోరారు.

సదరు నేరస్థున్ని  పట్టుబడి చేసిన దాంట్లో కోదాడ టౌన్ ఎస్ఐ ఎస్.కె సైదులు, Si లింగయ్య, హెడ్ కానిస్టేబుల్ బి.శ్రీనివాస్, వి.రామ రావు,  కానిస్టేబుల్స్ సతీష్ నాయుడు, యెల్లారెడ్డి , యస్.కె ఫరీద్, శివ కుమార్ మరియు నాగేంద్ర బాబు,  పర్యవేక్షణ చేసిన సిఐ టి.రాముని పోలీస్ అధికారులు ఎస్పీ గారు అబినందించినారు. 

అరెస్ట్ చేసిన నిందితుల వివరాలు 
A-3: చొరగుడి తేజ వయసు: 21 సం. వృత్తి: కార్ టెక్నీషియన్, పెనమలూరు మండలం ఎన్‌టి‌ఆర్ కృష్ణ జిల్లా. 
A-4: ఉమ్మడిశెట్టి సంపత్ కుమార్ వయసు: 20 సం. వృత్తి: టాటా కాపిటల్ మైక్రో ఫైనాన్స్ లో లోన్ ఆఫీసర్, ఎన్‌టి‌ఆర్ కృష్ణ జిల్లా. 
A-5: పాలపర్తి కృష్ణచైతన్య వయసు: 21 సం., వృత్తి: ఎల్&టి కంపెనీలో ఆప్రింటీస్షిప్ వర్క్, పామర్రు మండలం, ఎన్‌టి‌ఆర్ కృష్ణ జిల్లా. 
A-6: ఖాజా నాగ వీర భాస్కర్ రావు, వయసు: 23 సం., వృత్తి: ఎల్&టి కంపెనీలో ఆప్రింటీస్షిప్ వర్క్, విజయవాడ(అర్బన్),ఎన్టిఆర్ కృష్ణ జిల్లా.
A-7: ఈడే హేమన్ నర్సింహా సాయి వయసు: 22 సం.  వృత్తి: స్టూడెంట్, R/o గుడివాడ గ్రామం మరియు మండలం, ఎన్‌టి‌ఆర్ జిల్లా.
పరారీలో ఉన్న నింధితులు.
- A-1: మల్లెడ వెంకట వంశీ పామర్రు మండలం కృష్ణ జిల్లా మరియు 
- A-2: గోకులముడి ఆనంద్ R/o వణుకూరు గ్రామం పెనమలూరు మండలం కృష్ణ జిల్లా పరారీలో ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333