సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సెక్రటరీ అలుగు వర్షిణి ని కలిసిన

కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్

Mar 4, 2025 - 19:37
Mar 4, 2025 - 22:27
 0  21
సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సెక్రటరీ అలుగు వర్షిణి ని కలిసిన

కోరుట్ల  04 మార్చి 2025 తెలంగాణవార్త ప్రతినిధి:- తెలంగాణ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సెక్రటరీ అలుగు వర్షిణి ని కలిసిన కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్..

కోరుట్ల పట్టణంలోని వేములవాడ రోడ్ లో గల బీఏస్సి ప్రభుత్వ బాలికల వ్యవసాయ కళాశాలని రాజేంద్రనగర్ అగ్రికల్చర్ విశ్వవిద్యాలయానికి ఈ యొక్క కళాశాలను అనుబంధం చేయాలని కోరారు.

ఇటీవల కళాశాల విద్యార్థులు రోడ్డుపై బైఠాయించిన విషయాన్ని సెక్రటరీ గారికి తెలియచేసారు. విద్యార్థులకు ప్రయోగశాల (ల్యాబ్) ఏర్పాటు మరియు మౌలిక సదుపాయాలు  నిర్మించాలని వినతిపత్రం అందజేశారు.. తెలంగాణ సాంఘిక సంక్షేమ  సంస్థల పరిధిలో ఉన్న కోరుట్ల మహిళ బీఏస్సి వ్యవసాయ కళాశాల..

రాజేంద్రనగర్ అగ్రికల్చర్ విశ్వవిద్యాలయంతో అనుబంధం..

ప్రతిష్టాత్మక రాజేంద్రనగర్ అగ్రికల్చర్ విశ్వవిద్యాలయంతో అనుబంధం చేయాలని కోరారు.. ఈ అనుబంధం ద్వారా విద్యార్థులకు మెరుగైన వనరులు, అధ్యాపకులు మరియు పరిశోధన అవకాశాలకు అందిస్తుందని తెలిపారు.. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే దిశగా ఈ అనుబంధం ఒక ముఖ్యమైన దశ అని పేర్కొన్నారు..

మౌలిక సదుపాయాల అభివృద్ధి..

సరిపోని కళాశాల పాఠశాల భవన సదుపాయాలు మరియు తీవ్రమైన మౌలిక సదుపాయాలు ఈ కళాశాల ఎదుర్కొంటుదని తెలిపారు. బాలికల విద్యార్థులకు ముఖ్యంగా  ప్రత్యేక మరుగుదొడ్లు మరియు అదనపు గదుల వంటి ప్రాథమిక సౌకర్యాలు లేవని వాటికి అవసరమైన మౌలిక సదుపాయాల నిర్మాణానికి అవసరమైన నిధులను కేటాయించాలని తెలిపారు.. 

ల్యాబ్ ప్రయోగశాల స్థాపన..

వ్యవసాయ విద్యకు శిక్షణ మరియు ప్రయోగశాల అవసరం అయినప్పటికీ ఈ కళాశాలలో ప్రయోగశాల లేదని అత్యాధునిక పరికరాలతో ఆధునిక ప్రయోగశాల స్థాపనకు అవసరమైన నిధులను అందించాలని కోరారు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333