క్యాలెండర్‌ను ఆవిష్కరించిన వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య
హన్మకొండ 30 డిసెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- హన్మకొండ కనకదుర్గ కాలనీలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో లూయిస్ ఆదర్శ అంధుల పాఠశాల విద్యార్థులు రూపొందించిన 2025 నూతన సంవత్సర క్యాలెండర్‌ను వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ఆవిష్కరించారు.అంధుల కోసం ప్రత్యేకంగా బ్రెయిలి లిపిలో క్యాలెండర్ రూపొందించిన అంధ విద్యార్థులను ఎంపీ అభినందించారు.ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ..అంధ విద్యార్థులు సాధారణ విద్యార్థులకు ఏ మాత్రం తీసీపోకుండా అన్ని రంగాల్లో వారి ప్రతిభను కనపరుస్తున్నారని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని విద్యార్థులను పోత్సహించారు. అనంతరం లూయిస్ బ్రెయిలీ 216వ జన్మదినోత్సవం సందర్భంగా జనవరి 4వతేదీన లూయిస్ ఆదర్శ అంధుల పాఠశాల స్థాపకుడు దివంగత నలివేల కుమారస్వామి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని పాఠశాల నిర్వహకులు, విద్యార్థులు ఎంపీ డా.కడియం కావ్య గారిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. అందుకు ఎంపీ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ నలివెల కళ్యాణి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.