తాటికుంట రిజర్వాయర్ లో భార్య భర్తలు గల్లంతు 

Sep 3, 2025 - 15:25
 0  11
తాటికుంట రిజర్వాయర్ లో భార్య భర్తలు గల్లంతు 
తాటికుంట రిజర్వాయర్ లో భార్య భర్తలు గల్లంతు 
తాటికుంట రిజర్వాయర్ లో భార్య భర్తలు గల్లంతు 

 స్వయంగా బోటులో గాలించిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు 

 కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే గారు. ...

ఈరోజు గద్వాల నియోజకవర్గం మల్డకల్ మండలం పరిధిలోని తాటికుంట గ్రామానికి చెందిన  దుబ్బోనీబావి రాముడు  భార్య సంధ్య  ఇద్దరు దంపతులు నిన్న సాయంత్రం ఆరు గంటల సమయంలో  తాటికుంట రిజర్వాయర్ కు చేపల వేట కోసం వెళ్లారు. అయితే రాత్రి తిరిగి ఇంటికి రాకపోవడంతో బంధువులు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు జిల్లా ఎస్పీ శ్రీనివాసులు రావు తో కలిసి రిజర్వాయర్ దగ్గరికి వెళ్లి పరిశీలించడం జరిగింది. 

 స్వయంగా ఎమ్మెల్యే గారు ఎస్పీ గారు రిజర్వాయర్ లోకి బోటులో గాలించిన చేయడం జరిగింది .  

 ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.... 


గ్రామంలో గ్రామంలో తీవ్ర విషాద సంఘటన జరగడం చాలా బాధాకరం అని తెలిపారు. గ్రామస్తులు వాళ్ల గురించి ఎటువంటి ఆచూకీ లభించకపోవడంతో వెంటనే అధికారులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న వెంటనే SDRF బృందాలు సంఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు ప్రారంభించాయి.  గజఈత గార్లతో గాలింపు చేయించి తొందరగా రిజర్వాయర్లు గల్లంతయిన వారిని గుర్తించాలని వారి పోలీస్ అధికారులకు, అధికారులకు సూచించారు. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం నుండి వారికి సహాయం సహాయం అందించే వారి కుటుంబ సభ్యులకు వారి పిల్లలకు ఆర్థికంగా ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకం అందించే విధంగా కృషి చేయడం జరుగుతుంది తెలిపారు. అధికారులు గజ ఈతగారులు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యల్లో తొందరగా గాలించి గల్లంతయిన వారిని గుర్తించాలని సూచించారు.

 ????ఈ కార్యక్రమంలో మాజీ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ శ్రీధర్ గౌడ్, మాజీ కౌన్సిలర్ మురళి, నాయకులు ప్రభాకర్ గౌడ్ అజమ్, చంద్రశేఖర్ రెడ్డి,  అధికారులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333