కోటమర్తి గ్రామంలో జై భీమ్ జై సమిదాన్ కార్యక్రమం

అడ్డగూడూరు 24 ఏప్రిల్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లాఅడ్డగూడూరు మండలంలోని కోటమర్తి గ్రామంలో జై బాపు జై భీమ్ జై సమ్మిదాన్ కార్యక్రమం నిర్వహించారు.ఎస్సీ కాలనీ నుండి తెలంగాణ తల్లి విగ్రహం వరకు రాలిగా జై బాపు జై భీమ్ జై సమిధన్ అడ్డగూడూరు మండల కోఆర్డినేటర్ కన్నెబోయిన గంగరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడ్డగూడూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిమ్మనగోటి జోజి వారితోపాటు మోత్కూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ లింగాల నర్సిరెడ్డి టీపీసీసీ రాష్ట్ర నాయకులు ఇటికాల చిరంజీవి మోత్కూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు చిత్తలూరు సోమన్న,బాల్యంల సాగర్,పాశం సత్యనారాయణ,చిత్తలూరు సోమనారాయణ ఖమ్మంపాటి సోమన్న, బొమ్మగాని లక్ష్మయ్య,కేసారపు శ్రీనివాస్ రెడ్డి,మందుల సోమయ్య,యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మేకల పవన్, సోమయ్య,కోటమర్తి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.