కోటపాడు పంచాయతీ కార్యదర్శి నీ సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్

Aug 1, 2025 - 20:24
 0  0

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్.మండల పరిధిలోని కోటపాడు గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శి డి.విజయ్ కుమార్ విధుల పట్ల పారిశుధ్య పనులలో నిర్లక్ష్యం చేసినందుకు శుక్రవారం జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేసినట్లు తెలిసింది. తమ గ్రామం లో పంచాయతీ కార్యదర్శి విధులకు సక్రమంగా రాకుండా గ్రామపంచాయతీలో పారిశుద్ధ పనులు పట్టించుకోకపోవడంతో వీధుల్లో చెత్త నిలువలు మురికి కాలువల్లో బురద దుర్వాసన ఏర్పడుతుందని గత మూడు రోజులు క్రితం గ్రామస్తులు గ్రామపంచాయతీ కార్యాలయం ముందు చెత్త వేసి నిరసన తెలిపారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు స్థానికులు ఫిర్యాదు చేయడం, నిరసన గురించి పత్రికల్లో వచ్చిన వార్తలకు స్పందించిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ విచారణ చేపట్టి పంచాయతీ కార్యదర్శి విజయకుమార్ ను సస్పెండ్ చేసినట్లు తెలిసింది.