కేసులు, పిర్యాదులు పెండింగ్ ఉంచకుండా పని చేయాలి.
పోలీసు సిబ్బందికి సూచనలు చేసిన జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్
జిల్లా పోలీస్ కార్యాలయం, సూర్యాపేట. 05/03/2025.
- కేసులు, పిర్యాదులు పెండింగ్ ఉంచకుండా పని చేయాలి.
- మహిళా సంభంద పిర్యాదులు, కేసులపై వేగంగా పని చేయాలి.
- కోర్టు లతో సమన్వయంతో పని చేయాలి.
- మెడికల్ సర్టిఫికెట్స్, పోస్టుమార్టం సర్టిఫికెట్, FSL రిపోర్ట్స్ తీసుకోవడంలో జాగ్రత్తలు పాటించాలి.
పోలీసు సిబ్బందికి సూచనలు చేసిన జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ గారు..
సూర్యాపేట, 5 మార్చి 2025 తెలంగాణవార్త ప్రతినిధి:- ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయం నందు జిల్లా పోలీసు అధికారులతో ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ గారు అదనపు ఎస్పీ నాగేశ్వరరావు గారితో కలిసి జిల్లా పోలీసు అధికారుల నెలవారి సమీక్షా సమావేశం నిర్వహించినారు. ఈ సమావేశం లో భాగంగా జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల డాక్టర్స్ పోరెన్సిక్ సైన్స్, వైద్యుల రిపోర్ట్స్ పొందడం అనే అమశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మెడికల్ సర్టిఫికెట్, పోస్టుమార్టం నివేదిక, FSL రిపోర్ట్స్ పొందడం ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్యులతో సమన్వయంతో పని చేయడం, మెడికల్ సర్టిఫికెట్స్ పొందడంలో మెళకువలు, సమస్యలు మొదలగు అంశాలపై వైద్యకలశాల్ డాక్టర్ కిషోర్, క్రాంతి కిరణ్ లు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎస్పి గారు మాట్లాడుతూ కేసులు, పిర్యాదులు పెండింగ్ లేకుండా పని చేయాలని, నాణ్యమైన దర్యాప్తు చేయాలి, మహిళా సంభందిత పిర్యాదులపై త్వరగా, కేసులపై వేగంగా స్పందించాలి అని పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని కోరారు. నేరాల నివారణ కోసం జిల్లా వ్యాప్తంగా కార్డన్ అండ్ సెర్చ్ లు, తనిఖీలు, పటిష్టమైన పెట్రోలింగ్, పోలీస్ బీట్స్ నిర్వహించాలని, అనుమానితుల కదలికలు, పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలని తెలిపినారు. అక్రమ రవాణా జరగకుండా చూడాలని అన్నారు. కోర్టు లతో, కోర్టు అధికారులతో సమన్వయంగా పని చేయాలని సూచించారు. సైబర్ మోసాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు. పోలీసు వాహనాల నాణ్యతను పరిశీలించారు, వాహనాలు కడిషన్ లో ఉండాలని తెలిపారు.
నూతన సాంకేతిక సాధనాలు అందించిన ఎస్పి..*
జిల్లాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ లకు నూతన కంప్యూటర్స్, ట్యాబ్ లు ఇతర సాంకేతికత సామాగ్రిని ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ గారు ఈరోజు అందించారు.
ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడం, కేసుల దర్యాప్తులో వేగంగా పని చేయడం, తనిఖీలు నిర్వహిస్తూ ఎన్ఫోర్స్మెంట్ సమర్థవంతంగా నిర్వర్తించడం లో భాగంగా రాష్ట్ర డీజీపీ గారి కార్యాలయం నుండి అందిన సాంకేతికత సామాగ్రిని జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఈరోజు ఎస్పి గారు స్టేషన్ ల SI లకు అందించారు.
ఈ కార్యక్రమం నందు అదనపు ఎస్పీలు నాగేశ్వరరావు, జనార్ధన్ రెడ్డి, సూర్యాపేట సబ్ డివిజన్ DSP రవి, కోదాడ డివిజన్ DSP శ్రీధర్ రెడ్డి, DCRB DSP మట్టయ్య, AR DSP నరసింహ చారి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్, DCRB ఇన్స్పెక్టర్ హరిబాబు, జిల్లాలో ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ లు రాజశేఖర్, రజిత రెడ్డి, రాము, రామకృష్ణా రెడ్డి, శ్రీను, రఘువీర్ రెడ్డి, చరమంద రాజు, లక్ష్మినారాయణ, SI లు, DCRB సిబ్బంది, ఐటీ కోర్ RSI రాజశేఖర్, సిబ్బంది ఉన్నారు.