కూలీల ఆటో పల్టీ ఇద్దరు పరిస్థితి విషమం
తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ కుక్క ఎదురు రావడంతో కూలీలతో వెళుతున్న ఆటో ఫల్టి. ఏడుగురు కూలీలకు గాయాలు. ఇద్దరి పరిస్థితి విషమం. ఆత్మకూర్ ఎస్. మండల పరిధిలోని తుమ్మలపెన్పాడు గ్రామo వద్ద కూలీలతో వస్తున్న ఆటోకుఆదివారం సాయంత్రం కుక్క ఎదురు రావడంతో అదుపుతప్పిన ఆటో మల్టీ కొట్టి ఏడుగురికి గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం పెన్ పహాడ్ మండలం అగ్రహారం గ్రామానికి చెందిన 14 మంది మహిళ కూలీలు పత్తి ఏరేందుకు ఆత్మకూరు ఎస్ మండలం కోటపాడు గ్రామానికి వెళ్లి కూలి పని ముగించుకొని అదే ఆటోలో తిరిగి వెళుతుండగా ఎస్సీ కాలనీ సమీపంలో ఎదురుగా వస్తున్న కుక్కను తప్పించబోయి అదుపు తప్పి ఆటో ఫల్టి కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తోపాటు మరో ఆరుగురు మహిళలకు గాయాలయ్యాయి.గాయాలైన వారిలో డ్రైవర్ ఎక్కినపళ్లి పుల్లయ్య, కూలీలు సలిగంటి నాగమ్మ, ఆకుల సోమమ్మ , అబ్బగాని సత్యవతి, చిత్తలూరు జ్యోతి, శేషగాని రమణ, చిత్తలూరు లక్ష్మమ్మ ఉన్నారు. వీరిలో డ్రైవర్ పుల్లయ్య, సలిగంటి నాగమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. 108 సహకారంతో చికిత్స నిమిత్తం గాయాలైన వారిని సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు.