కాంగ్రెస్ హయాంలోనే జిల్లా అభివృద్ధి.. ధర్మపురి సంజయ్

తెలంగాణవార్త 24 ఏప్రిల్ నిజామాబాద్ జిల్లా ప్రతినిధి :- గత బీఆర్ఎస్ హయాంలో ప్రజలకు చేసింది ఏమీ లేదని…దోచుకోవడం..దాచుకోవడం తప్ప అభివృద్ధి శూన్యమని మాజీ మేయర్,కాంగ్రెస్ నాయకులు ధర్మపురి సంజయ్ అన్నారు. ప్రజా సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యమని ప్రజలు ఒక్కసారి ఆలోచించి కాంగ్రెస్ కు పట్టం కట్టాలని కోరారు.బుధవారం నిజామాబాద్ నగరం లోని ప్రగతి నగర్ లో గల మున్నూరు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మేయర్ కాంగ్రెస్ నాయకులు ధర్మపురి సంజయ్ మాట్లాడుతూ… బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో ప్రజలను మోసం చేయడంతోనే రాక్షస పాలనను ప్రజలు బొంద పెట్టిండ్రని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ.. డైనమిక్ నాయకుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జీవన్ రెడ్డి 6సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా అపార అనుభవం ఉన్న రాజకీయ నాయకుడన్నారు. జీవన్ రెడ్డి డి.ఎస్.కు అత్యంత సన్నిహితుడని తెలిపారు.