కాంగ్రెస్ కార్యకర్తలారా... మేల్కొండి!
ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లండి.
డోర్నకల్, సెప్టెంబర్ 3, 2026:- కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరింత చురుగ్గా పనిచేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని డోర్నకల్ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ డాక్టర్ రాంచందర్ నాయక్ పిలుపునిచ్చారు.
ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, గ్రామాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనతో పాటు పేదలు, అర్హులైన కుటుంబాలకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు. గ్రామాలకు నిధులు తీసుకువస్తూ అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు.
అయితే ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో పార్టీ శ్రేణులు మరింత చురుకుగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. సోషల్ మీడియా నేటి కాలంలో ప్రజలకు సమాచారాన్ని వేగంగా చేరవేసే శక్తివంతమైన వేదిక అని, ప్రతి కార్యకర్త దీనిని బాధ్యతాయుతంగా వినియోగించాలని సూచించారు.
ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రోజుకు కనీసం 5 నిమిషాలు పార్టీ కోసం కేటాయించి, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమాలకు సంబంధించిన వాస్తవ సమాచారాన్ని వాట్సాప్ స్టేటస్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరవేయాలని కోరారు.
“ఒక్క కార్యకర్త... రోజుకు ఒక్క పోస్ట్” అనే స్ఫూర్తితో ప్రతి కార్యకర్త ముందుకు రావాలని అన్నారు. వందలాది, వేలాది మంది కార్యకర్తలు సమష్టిగా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తే ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల సమాచారం మరింత విస్తృతంగా ప్రజలకు చేరుతుందని తెలిపారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు కులం, మతం, రాజకీయ భేదాలు లేకుండా అర్హులైన ప్రతి కుటుంబానికి అందేలా ప్రభుత్వం పనిచేస్తోందని డాక్టర్ రాంచందర్ నాయక్ స్పష్టం చేశారు. అసత్య ప్రచారాలకు తావివ్వకుండా వాస్తవాలు, అధికారిక సమాచారంతో ప్రజలకు సమాధానం ఇవ్వాలని కార్యకర్తలకు సూచించారు.
“మన పని మనమే ప్రజలకు చెప్పాలి...
మన అభివృద్ధిని మనమే ప్రజల్లోకి తీసుకెళ్లాలి...
నిజమైన సమాచారాన్ని ప్రతి ఇంటికీ చేరవేయాలి” అని ఆయన అన్నారు.
కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఐక్యత, క్రమశిక్షణ, సమన్వయంతో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రతి కార్యకర్త బాధ్యతాయుతమైన సోషల్ మీడియా కార్యకర్తగా పనిచేయాలని డాక్టర్ రాంచందర్ నాయక్ పిలుపునిచ్చారు.
జై కాంగ్రెస్!
జై తెలంగాణ!
జై హింద్!
ఇట్లు,
డాక్టర్ రాంచందర్ నాయక్
డోర్నకల్ నియోజకవర్గ శాసనసభ్యులు & ప్రభుత్వ విప్