బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సార్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు
ప్రజలకు అండగా బీఆర్ఎస్ ఓటు హక్కు పరిరక్షణకు ప్రత్యేక చొరవ!
అడ్డగూడూరు 9 జూలై 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో ప్రజలకు ఎన్నికల ఎన్యూమరేషన్ (సార్) ఫారంలు నింపడంలో సహాయం అందించేందుకు మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ సూచనల మేరకు,బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన ప్రత్యేక సార్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఈ హెల్ప్ డెస్క్ ద్వారా ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారంలను ఉచితంగా నింపించడం, అవసరమైన వివరాలను నమోదు చేయించడం, సందేహాలకు సమాధానాలు ఇవ్వడం వంటి సేవలు అందిస్తున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతి అర్హులైన ఓటరు తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకొని ఓటు హక్కును పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిప్పలపల్లి మహేంద్రనాథ్, మాజీ ఎంపీటీసీ పూలపల్లి జనార్దన్,టౌన్ అధ్యక్షుడు నాగులపెల్లి దేవగిరి, సర్పంచ్ పూజారి వనజ సైదులు, ఉప్ప సర్పంచ్ వరిగడ్డి లోకేష్, నాయకులు లింగాల అశోక్ గౌడ్, కాడరి సైదులు, అంతోని, గజెల్లి రవి, గుడెపు పరమేష్, తెలవారి నరేష్ గౌడ్, శీలం దావీద్ మండల, పయ్యావుల రమేష్, మహేష్, మచ్చగిరి, బోనాల మహేందర్, చిప్పలప్పేలి నరేందర్, పొన్నాల నవీన్ కుమార్, జక్కుల రవి బిఎల్ ఓలు,నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.