కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర మహ సభలను జయప్రదం చేయండి

Nov 13, 2025 - 16:26
Nov 13, 2025 - 18:46
 0  1
కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర మహ సభలను జయప్రదం చేయండి

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర మహ సభలను జయప్రదం చేయండి . ఈనెల 28 29 30 తేదీలలో సూర్యపేట జిల్లాలో జరిగే కల్లు గీత కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర 4 వ మహాసభలను జయప్రదం చేయాలని కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గురువారం ఏపూర్ గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గీత కార్మికులకు 4000 రూపాయలు పెన్షన్, 10 లక్షల ఎక్స్గ్రేషియా పెంచాలని, కాటమయ్య రక్షణ కవచం ఇవ్వాలని గీత కార్మికులకు ఇవ్వాల్సిన పెండింగ్ ఎక్స్గ్రెషియ వెంటనే విడుదల చేయాలని తాటి, ఈత ఉత్పత్తిలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని తదితర డిమాండ్ల పరిష్కారం కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సొసైటీ అధ్యక్షుడు బుడిగ లింగయ్య గౌడ్, గ్రామ మాజీ సర్పంచి రజిత సుధాకర్ , అబ్బగాని బిక్షం గౌడ్,జిల్లా కమిటి సభ్యులు మామిడి లింగయ్య గౌడ్,మండల కార్యదర్శి బెల్లం కొండ ఇస్తారి గౌడ్, మండల కమిటీ సభ్యులు బత్తిని మల్లయ్యగౌడ్, జలగం రాములుగౌడ్ ,జుజ్జురి సైదులు గౌడ్,ఎరుకల సైదులు గౌడ్ పాల్గొన్నారు.