కర్ల లలితమ్మ చేస్తున్న పోరాడానికి""టిఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు""మాజీ ఎమ్మెల్యే బొల్లం
*కోదాడ రూరల్ సీఐ ప్రతాప లింగం సస్పెన్షన్ కానీ చిలుకూరు ఎస్సై సురేష్ రెడ్డిని మాత్రం సస్పెండ్ చేయకపోవడానికి కులవివక్షయే కారణం...*
*కర్ల రాజేష్ మృతికి ప్రధాన కారకుడు చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డి...*
*చిలుకూరు ఎస్సై సురేష్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేసి అరెస్టు చేయాలి...*
*రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్న కర్ల రాజేష్ మృతిపై జిల్లా మంత్రి, స్థానిక ఎమ్మెల్యే నేటికీ నోరు విప్పకపోవడానికి కారణం ఏంటి?*
*ఇది ముమ్మాటికీ రాజకీయ హత్యే... సామాన్యుడికి ఓ న్యాయం అగ్రకులాలకు ఓ న్యాయం...*
*కోదాడలో సామజిక పాలన కాదు కుల పాలన సాగుతుంది...*
*బీసీ బిడ్డలను అడ్డగోలుగా సస్పెండ్ చేస్తారు కానీ మీ రెడ్డి బిడ్డలకు మాత్రం అండగా ఉంటారు...*
*ఎస్సై రెడ్డి కావడం వల్లే సురేష్ రెడ్డిని తప్పించడానికి పద్మావతి రెడ్డి కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు...*
*కర్ల లలితమ్మ చేస్తున్న పోరాటానికి BRS పార్టీ పక్షాన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాను - మాజీ ఎమ్మెల్యే, BRS పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ బొల్లం మల్లయ్య యాదవ్.*
*ఇటీవల లాకప్ డెత్ కి గురైన కర్ల రాజేష్ కుటుంబానికి న్యాయం జరగాలని,కర్ల రాజేష్ మరణానికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చిలుకూరు ఎస్సై సురేష్ రెడ్డిని సస్పెండ్ చేయాలని వారిపై హత్యా నేరం కేసు నమోదు చేయాలని కర్ల రాజేష్ డెడ్ బాడీని రీపోస్టుమార్టం చేయాలని డిమాండ్ చేస్తూ MRPS జాతీయ అధ్యక్షుడు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారి ఆదేశానుసారం కోదాడ పట్టణంలో జరుగుతున్న MRPS రిలే నిరాహార దీక్ష శిభిరానికి వెళ్ళి మద్దతు ప్రకటించిన కోదాడ మాజీ ఎమ్మెల్యే, BRS పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ బొల్లం మల్లయ్య యాదవ్ గారు.* ఈ సందర్భంగా *మల్లయ్య యాదవ్* మాట్లాడుతూ *కర్ల రాజేష్ లాకప్ డెత్ సంఘటనలో చట్ట విరుద్ధంగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన కర్ల రాజేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని ఐదు రోజులపాటు తీవ్రంగా చిత్రహింసలు పెట్టి అతని చావుకు కారణమయ్యారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు అధికార పార్టీ ఎమ్మెల్యే ఒత్తిడికి తలొగ్గి చర్యలు తీసుకోవడంలో కుల వివక్షతను పాటించారని అన్నారు. కోదాడ రూరల్ సీఐ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కనుకనే సస్పెండ్ చేశారని చిలుకూరు ఎస్సై సురేష్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కనుకనే సస్పెండ్ చేయలేదని ఈ రకంగా కులాన్ని బట్టి శిక్షలు విధించడం, అలాగే కులాన్ని బట్టి తప్పులు చేసినా కాపాడడమనేది సరైన పద్దతి కాదని అన్నారు.కర్ల రాజేష్ మృతి సంఘటనలో ప్రధాన కారకుడు చిలుకూరు ఎస్సై సురేష్ రెడ్డి కాబట్టి తక్షణమే చిలుకూరుఎస్సై సురేష్ రెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.ఈ విషయంలో భాధిత కుటుంబానికి సంపూర్ణ న్యాయం జరిగే వరకు BRS పార్టీ పక్షాన సంపూర్ణ మద్దతు ప్రకటించి అండగా ఉంటామని అన్నారు.రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్న కర్ల రాజేష్ మృతిపై జిల్లా మంత్రి, స్థానిక ఎమ్మెల్యే నేటికీ నోరు విప్పలేదు సరికదా కనీసం స్పందించనూ లేదు.ఇది ముమ్మాటికీ రాజకీయ హత్యే.సామాన్యుడికి ఓ న్యాయం అగ్రకులాలకు ఓ న్యాయం అంటూ కోదాడలో సామజిక న్యాయం పాలించడం లేదు కులన్యాయం పాలన సాగుతుంది.బీసీ బిడ్డలను అడ్డగోలుగా సస్పెండ్ చేస్తారు కానీ మీ రెడ్డి బిడ్డలకు మాత్రం అండగా ఉంటారు.ఎస్సై రెడ్డి కావడం వల్లే సురేష్ రెడ్డిని తప్పించడానికి పద్మావతి రెడ్డి కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.కర్ల లలితమ్మ చేస్తున్న పోరాటానికి BRS పార్టీ పక్షాన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాను. వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానన్నారు.* ఈ కార్యక్రమంలోBRS పార్టీ నాయకులు, MRPS నాయకులు తదితరులు పాల్గొన్నారు.