కబేలాకు తరలిస్తున్న గోవుల వాహనాన్ని సీజ్ చేసిన.... ఎస్ఐ అంజిరెడ్డి

Apr 10, 2024 - 20:28
Apr 10, 2024 - 20:58
 0  3
కబేలాకు తరలిస్తున్న గోవుల వాహనాన్ని సీజ్ చేసిన.... ఎస్ఐ అంజిరెడ్డి

మునగాల 10 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి :- కబేలాకు తరలిస్తున్న 9 గోవుల వాహనాన్ని పట్టుకున్న మునగాల ఎస్ఐ వాహనాన్ని సీజ్ చేసి తొమ్మిది గోవులను గోశాలకు తరలించిన వైనం గోవులను హైదరాబాద్ కబేలాకు తరలిస్తున్న వారిపై కేసు నమోదు  మునగాల మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ వైద్యశాల ఎదురుగా నేషనల్ హైవే 65 పై  మంగళవారం సాయంత్రం  స్థానిక ఎస్సై అంజిరెడ్డి తమ సిబ్బందితో వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా కోదాడ నుండి బొలెరో గూడ్స్ వ్యాన్ క్యాబిన్లో 9 గోవులను బంధించి  హైదరాబాదు తరలిస్తున్న వాహనాన్ని స్థానిక పోలీసులు అడ్డగించారు దీంతో వాహనంలోనే డ్రైవర్ మరొక ఇద్దరు వ్యక్తులు వాహనాన్ని నిలుపుదల చేసి పారిపోతుండగా స్థానిక పోలీసులు వెంబడించి పట్టుకొని వారిని మరియు వాహనాన్ని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించి ,బొలెరో గూడ్స్ వాహనం తాళాలు తెరిచి చూడగా బంధించి ఉన్న తొమ్మిది గోవులు ప్రత్యక్షమవడంతో ఉన్నత అధికారులకు సమాచారం అందించి కేసు నమోదు చేసినట్లు తెలిసింది ఇట్టి సంఘటనపై పూర్తి వివరాలు స్థానిక ఎస్సై అధికారికంగా తెలియజేయాల్సి ఉంది .

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State