కట్ట మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న తాటి
అశ్వారావుపేటమండలం నారాయణపురం గ్రామంలో జరుగుతున్న శ్రీశ్రీశ్రీ కట్ట మైసమ్మ అమ్మ వారి 14వ వార్షికోత్సవ మహోత్సవంలో బూర్గంపహాడ్, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్రం మాజీ ట్రైకర్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు గారు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించారు. వారు మాట్లాడుతూ కట్ట మైసమ్మతల్లి దీవెనలతో నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నారు.. అన్నదానం కొరకు వారి సతీమణి, తాటి రత్నకుమారి, కుమార్తె తాటి మహాలక్ష్మి గార్ల పేరు మీద 5000/-"రూ" ను ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు... ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి అంకిత మల్లికార్జున రావు గారు, మాజీ సర్పంచ్ పొట్ట రాజులు గారు, ఆలయ కమిటీ సభ్యులు చందా లక్ష్మి నర్సయ్య గారు, నిర్మల పుల్లారావు గారు,నరసింహారావు గారు, ఆకుల నాగేశ్వరావు గారు తదితరులు పాల్గొన్నారు....