ఉమ్మడి గురుకుల ప్రవేశ పరీక్ష – TG CET 2026 ను ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం - జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్

Jan 2, 2026 - 19:26
 0  28
ఉమ్మడి గురుకుల ప్రవేశ పరీక్ష – TG CET 2026 ను ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం - జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్

 జోగులాంబ గద్వాల 2 జనవరి 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి :  గద్వాల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి నుండి 9వ తరగతి వరకు వివిధ గురుకుల విద్యాలయాలలో ప్రవేశాకై ఉమ్మడి గురుకుల ప్రవేశ పరీక్ష – TG CET 2026 ను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్  తెలిపారు.

ప్రధాన వివరాలు ఇలా ఉన్నాయి:
•    ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 11-12-2025
•    దరఖాస్తుల చివరి తేదీ: 21-01-2026
•    ప్రవేశ పరీక్ష తేదీ: 22-02-2026 (ఉ.11.00 గం. నుండి మ.1.00 గం. వరకు)
•    దరఖాస్తు ఫీజు: రూ.100/-

ఈ ప్రవేశ పరీక్ష ద్వారా కింది సంస్థల పరిధిలోని గురుకుల పాఠశాలలలో ప్రవేశాలు కల్పించబడతాయి:
•    TGSWREIS
•    TGTWREIS
•    MJPTBCWREIS
•    TGREIS

అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్ ద్వారా TG CET Online Apply Portal (Gurukula CET) ➡️ https://tgcet.cgg.gov.in/  కానీ, TGSWREIS (Social Welfare Residential Schools) ➡️ https://tgswreis.telangana.gov.in/ దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333