ఉత్తమ ఫొటోగ్రాఫర్ గా నంది అవార్డు అందుకున్న శ్రీనివాస్

మాడుగులపల్లి, ఏప్రిల్ 14 తెలంగాణ వార్త : తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో చైర్ పర్సన్ వెన్నెల గద్దర్ చేతుల మీదుగా
ఉత్తమ ఫోటోగ్రఫీ పురస్కారన్ని నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం లోని కుక్కడం గ్రామానికి చెందిన బొంగరాల శ్రీనివాస్ ఉత్తమ నంది అవార్డుఅందుకున్నారుఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఉత్తమ ఫొటోగ్రాఫి విభాగం లో నంది పురస్కారాన్ని అందుకోవడం చాల సంతోషంగా ఉందని ఎవరైనా వారు వారి రంగాలలో పట్టుదలతో, నిరంతరంశ్రద్ధాశక్తులతో చేసే పనులతో మంచి గుర్తింపు వస్తుందనడానికి నాకు దక్కిన ఈ గౌరమే కారణం అని మాట్లాడారు కార్యక్రమం లో ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు పద్మిని దేవి, వల్లూరి ఫౌండేషన్ అధినేత శ్రీనివాస్ రాజు, వెన్నెల తెలంగాణ సంస్కృతి శాఖ చైర్పర్సన్ దైవజ్ఞ శర్మ, డాక్టర్ దేవి,రామకృష్ణ గౌడ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ఆఫ్ కమిటీ సభ్యులు తదితరులున్నారు పాల్గొన్నారు.