ఉత్తమ ఉద్యోగి ప్రశంస పత్రాన్ని అందుకున్న గురురాజ్

జోగులాంబ గద్వాల 26 జనవరి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి.
గద్వాల:- రెవిన్యూ శాఖలో పని చేసే గురురాజ్ ఉత్తమ ఉద్యోగి ప్రశంస పత్రం ఆదివారం అందుకున్నారు. జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉత్తమ ఉద్యోగులకు ఇచ్చే అవార్డులో భాగంగా విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన గురు రాజ్ కి కలెక్టర్ సంతోష్ కుమార్ మరియు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు,ఎమ్మెల్యేలు చేతులమీదుగా ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. గురురాజ్ కు తోటి మిత్రులు,పలువురు ప్రజా ప్రతినిధులు అభినందనలు తెలిపారు.