ఉగ్రవాదుల చర్య పై బిజెపి ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ప్రదర్శన
పాకిస్తాన్ దిష్టిబొమ్మ దహనం
మాడుగుల పల్లి మండల బిజెపి అధ్యక్షులు ఇటికాల జాన్ రెడ్డి
తెలంగాణ వార్త మాడుగులపల్లి ఏప్రిల్ 23 : జమ్ము కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడుల్లో మృతి చెందిన వారికి సంతాపాన్ని ప్రకటిస్తూమాడుగులపల్లి మండల కేంద్రంలో మాడుగులపల్లి బిజెపి మండల అధ్యక్షులు ఇటికాల జాన్ రెడ్డి, అధ్యక్షతన బుధవారం కొవ్వొత్తులతో పార్టీ నేతలతో కలిసి నార్కట్పల్లి అద్దంకి రహదారి పై ప్రదర్శన నిర్వహించి పాకిస్తాన్ దిష్టిబొమ్మ దహనం చేశారుఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కిసాన్ మూర్ఛ అధ్యక్షులు గడ్డం వెంకట్ రెడ్డి,జిల్లా కౌన్సిల్ సభ్యులు బొమ్మకంటి నరసింహ, హాజరై ఈ సందర్భంగా మాట్లాడుతూ అమాయక పర్యాటకుల మీద పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేయడాన్ని ఉగ్రవాద సంస్థల పిరికి చర్యగా భావించారు.శాంతి భద్రతలకు వివాదం కలిగించే ఈ ఉగ్రవాద సంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలి ఉగ్రవాదాన్ని రూపుమాపలని ఉగ్రవాద సంస్థలు ఎక్కడ ఉన్నా వెతికి వెతికి ఆ స్థావరాలపై దాడి చేసి ఉద్రవదాం లేకుండా చేయాలని అనారు.మన భారతీయ జవాన్లు తక్షణ చర్యలు తీసుకొని ఉగ్రవాదుల చేతుల నుంచి ఈ దేశాన్ని కాపాడాలని అందుకు హిందూ సైన్యం అంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు రాంరెడ్డి,దాసరి యాదగిరి,దారమల్ల నాగరాజు,గురుస్వామి,శ్రీనివాస్ రెడ్డి,వెంకట్ రెడ్డి,గంగరాజు,ప్రభాకర్ గౌడ్,బూత్ అధ్యక్షులు సైదులు, వెంకటరెడ్డి,శ్రీనివాస్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.