ఈనెల 29న మందకృష్ణ మాదిగ రాక..ఉమ్మడి నల్లగొండ జిల్లా మాదిగల ధర్మయుద్ధ సదస్సును జయప్రదం చేయండి.
ఎస్సీ వర్గీకరణ అమలు చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి కమిటీ పేరుతో కాలయాపన చేస్తూ మాదిగలను మోసం చేస్తున్న విధానాన్ని నిరసిస్తూ....ఈనెల 29న జిల్లా కేంద్రంలో జరుగు మాదిగల ధర్మయుద్ధ ఉమ్మడి నల్లగొండ జిల్లా సదస్సను జయప్రదం చేయుటకై ఈరోజు స్థానిక అంబేద్కర్ భవన్లో ఉమ్మడి నల్గొండ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం ఎంఎస్పి నల్గొండ జిల్లా అధ్యక్షులు బకరం శ్రీనివాస్ మాదిగ అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంఎస్పి ఉమ్మడి నల్లగొండ జిల్లా కో-ఆర్డినేటర్ కందుకూరి సోమన్న మాదిగ హాజరై వారు మాట్లాడుతూ....
రేవంత్ రెడ్డి మాదిగలతో తియ్యగా మాట్లాడి, మాదిగలపట్ల ఎంతో ప్రేమ ఉన్నట్లు నటిస్తూ..మాదిగలకు ద్రోహం చేస్తున్నాడని అన్నారు.
ఆగస్ట్ 1న సుప్రీం కోర్టు ఎస్సి వర్గీకరణ చేసుకోవచ్చు అని తీర్పు ఇచ్చింది సుప్రీమ్ కోర్టు తీర్పు వచ్చిన అర్ధగంటలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశంలోనే మొట్టమొదటిగా తెలంగాణలోనే వర్గీకరణ చేస్తామని ప్రకటించారు.
తెలంగాణలో ఏ నోటిఫికేషన్ వచ్చిన వర్గీకరణ అమలు ఐతదని ముఖ్యమంత్రి రేవంత్ అసెంబ్లీలో హామీ ఇచ్చారు
రెండు నెలలు తిరుగక ముందే మాట మార్చిన రేవంత్ రెడ్డి మాదిగలకు ద్రోహం చేశారు.
దేశంలోనే తెలంగాణ రాష్ట్రం వర్గీకరణలో మొట్టమొదటి రాష్ట్రం ఐతదని మాదిగలు ఎంతో సంతోషించారు.
రేవంత్ రెడ్డి చేస్తున్న నమ్మక ద్రోహాన్ని మాదిగ జాతి సహించదు.
విద్యా శాఖ తన పరిధిలోని ఉన్నది. ఎస్సీ వర్గీకరణ మీద మాట ఇచ్చి తన శాఖ పరిధిలోనే 11 వేలకు పైగా టీచర్ పోస్టులను ఎస్సీ వర్గీకరణ లేకుండా భర్తీ చేయడం జరిగిందన్నారు.
ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవడం కోసం మాదిగలకు అన్యాయం చేయడం తగదు...
ఒక జాతికి న్యాయం చేయడం కన్నా ముఖ్యమంత్రి పదవీ కాపాడుకోవడమే ఎక్కువా...?
మల్లిఖార్జున్ ఖర్గే ,కొప్పుల రాజు ను చూసి సీఎం రేవంత్ రెడ్డి భయపడుతున్నాడు ..
రాష్ట్రంలోని మాల ప్రజాప్రతినిధులకు తలొగ్గి ఉద్యోగాలు దోచి పెట్టే కార్యక్రమానికి పూనుకున్నాడు...
మాదిగలకు ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదుర్కోవటానికి ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల నాయకులు మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఈనెల 29న జరిగే *మాదిగలధర్మ యుద్ధం సదస్సు"*ను మాదిగ మాదిగ ఉప, ఉద్యోగులు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాదిగ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు గాదె రమేష్ మాదిగ, సూర్యాపేట, భువనగిరి యాదాద్రి జిల్లాల ఎంఎస్పి అధ్యక్షులు యాతాకుల రాజన్న మాదిగ, నల్ల చంద్రస్వామి మాదిగ, నల్లగొండ, సూర్యాపేట ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఇరిగి శ్రీశైలం మాదిగ, వినయ్ మాదిగ, మాదిగ ఉద్యోగుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లపాక వెంకన్న మాదిగ, ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షులు మామిడి సైదులు మాదిగ, రాష్ట్ర నాయకులు లంకపల్లి నగేష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బోడ సునీల్ మాదిగ, ఎంఎస్పి రాష్ట్ర నాయకులు అడేపు నాగార్జున మాదిగ, మేడి శంకర్ మాదిగ, కొమిరే స్వామి మాదిగ, కందుల మోహన్ మాదిగ, బొజ్జ దేవయ్య మాదిగ, ఎర్ర వీర స్వామి మాదిగ, ఏపూరి రాజు మాదిగ, బొజ్జ చిన్న, ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి కత్తుల సన్నీ, ఆంజనేయులు మాదిగ, వీహెచ్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పెరిక శ్రీనివాసులు, కొమ్ము హరి, జలంధర్, ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షులు మాసారం వెంకన్న, తరి ఏడుకొండలు, రణవీర్, చింత శివశంకర్, బొజ్జ నవీన్, ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి మరియు అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.