ఎన్నికల నిబంధనలను సక్రమంగా పాటించాలి
అడ్డగూడూరు 08 డిసెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– అడ్డగూడూరు మండల కేంద్రంలోని వివిధ కార్యాలయాలను జిల్లా అడిషనల్ కలెక్టర్ సందర్శించారు.జిల్లా అడిషనల్ కలెక్టర్ ఎమ్మార్వో కార్యాలయంను ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించి రెండవ గ్రామపంచాయతీ సాధారణ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ రిపోర్టులను పరిశీలించి తగు సూచనలను చేయడం జరిగింది.ఇట్టి సమావేశంలో ఎంపీడీవో శంకరయ్య,ఎమ్మార్వో, శేషగిరిరావు,ఎంపీఓ ప్రేమలత,ఎంపీడీవో కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.