ఈనెల 25న హైదరాబాద్ DME ఆఫీస్ కోటి నందు మహా ధర్నా జయప్రదం చేయండి
SPS అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కుర్రి సైదయ్య
ఈరోజు సూర్యాపేట GGH హాస్పటల్ మరియు జిల్లాలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్ లో పనిచేస్తున్న శానిటేషన్ పేషంట్ కేర్ సెక్యూరిటీ సూపర్వైజర్ మెడికల్ అండ్ హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ తరపున రాష్ట్ర ట్రెజరర్ పత్తిపాటి శ్రీనివాస్ అధ్యక్షతన సమావేశం నిర్వహించినారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షులు కుర్రి సైదయ్య పాల్గొని మాట్లాడుతూ..... తెలంగాణ రాష్ట్ర 33 జిల్లాల నందు ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ లో పనిచేస్తున్న నాతోటి శానిటేషన్ పేషంట్ కేర్ సెక్యూరిటీ సూపర్వైజర్ వర్కర్స్ గా ప్రభుత్వ ఆసుపత్రిలో గత 20 25 సంవత్సరం నుండి పనిచేస్తూ చాలీచాలని జీతాలతో కుటుంబ పోషణ ఇబ్బందుల్లో ఎంతోమంది కార్మికులు రోడ్డు పాలవుతున్నారని ఆవేదన వ్యక్తపరిచినారు బెడ్ సైడ్ కార్మికులుగా మేము విధులు నిర్వహిస్తుండగా మాపైన దళారు వ్యవస్థగా ఉన్నటువంటి కాంట్రాక్టర్లు మా పొట్ట కొడుతూ వారి జేబుల్లో ఖజానా వేసుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం మా 17,800 మంది కార్మికుల పక్షాన ఆలోచన చేయాలి అని డిమాండ్ చేసినారు. EPF & ESI కట్టే విధానంలో కూడా ఎన్నో అక్రమాలకు పాల్పడుతున్నారని తెలియపరిచారు. కార్మికుల వేతనంలోనే డబ్బులు కట్ చేసి డబల్ EPF రూపంలో మరల కార్మికులకు వేస్తున్నారు. 2022 రాష్ట్రవ్యాప్తంగా జీవో నెంబర్ 60 ప్రకారం ప్రతి కార్మికుడికి 15600/- వేతనం ఉండగా EPF & ESI కటింగ్ మినహా 12093/- ఇవ్వవలసి ఉండగా రాష్ట్రంలో 90% పైగా హాస్పిటల్ నందు మా కార్మికులకు 9000/- , 10,000/- , 11000/- ఇస్తూ మా కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నారు.
ఇప్పటికైనా దళారీ వ్యవస్థలు గా ఉన్న కాంటాక్ట్ నుండి మాకు విముక్తి కలిగించి మా కార్మికులందరినీ IFMIS విలియం చేయాలి అని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్న బొస్క నరేష్ డిమాండ్ చేశారు.
అనంతరం సూర్యాపేట GGH హాస్పిటల్ కార్మికులు పాల్గొని వారి జిల్లా కమిటీ అందరి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యడం జరిగింది.
జిల్లా కమిటీ గౌరవ అధ్యక్షులు::: సుభాని
జిల్లా గౌరవ
జిల్లా కమిటీ అధ్యక్షులు ::: నాగభూషణ్
జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు :: 1. రవి
2. త్రివేణి
జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి . మౌనిక
జిల్లా కమిటీ సహాయ కార్యదర్శులు ::: శ్రీనివాస్.
కోశాధికారి, లక్ష్మణ్.
ప్రచార కమిటీ. మధుకర్.
తదితలతో కూడిన కమిటీని ఎన్నిక చేయటం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి చిన్న బోస్క నరేష్
రాష్ట్ర కమిటీ సభ్యులు నాగమణి, ప్రవీణ్, భూషణ్ తదితరులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు.