ఇష్టారాజ్యంగ మద్యం దుకాణాల అమ్మకాలు.

జాయింట్ కలెక్టర్ శ్రీజ కు వినతి పత్రం

Mar 17, 2025 - 19:29
Mar 17, 2025 - 21:04
 0  5
ఇష్టారాజ్యంగ మద్యం దుకాణాల అమ్మకాలు.

ఖమ్మం, 17 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- ఖమ్మం : ఎస్సీ , ఎస్టీ , బీసీ , డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సేవా సంఘం ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ శ్రీజ కు వినతి పత్రం అందజేశారు . ఖమ్మం పట్టణంలో వైన్ షాపుల వద్ద ( మద్యం దుకాణాలు ) మెయిన్ రోడ్ల పక్కన్న ఉన్న షాపుల వద్ద నడిరోడ్డు పై వాహనాల నిలుపుతూ వచ్చి పోయే వారికి ఆటంకం కలిగిస్తూ మద్యం మత్తులో ముఖ్యంగా మహిళలను బ్యాడ్ కామెంట్ చేస్తూ ఇదేమిటి అని అడిగిన వారి ఫై దౌర్జన్యం చేస్తున్నారు . సమ్ ఏరియాల్లో ప్రధానంగా త్రీ టౌన్ ఏరియాలో కట్టెల మండ్డెల షాపు , ప్రకాష్ నగర్ , మున్నేరు బ్రిడ్జి దగ్గర షాపు , గాంధీ గంజ్ , పాత అంబే టాకీస్ షాపుల వద్ద నడిరోడ్లో పై వాహనాలను నిలుపుతూ ఇదేమిటి అని అడిగిన వారిని పై దౌర్జన్యం చేస్తున్నారని పేర్కొన్నారు . పలుమార్లు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి కంప్లైంట్ ఇచ్చిన పట్టించుకునే దాఖలు లేవు నిబంధనలకు విరుద్ధంగా నడిపే షాపుల పై తక్షణమే చట్టరిచ్చ కఠినమైన చర్య తీసుకొని రోడ్డు ఫేసు షెటర్ కాకుండా లోపటపక్క షటరు ఓపెన్ చేసుకోవాలని కోరారు . ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్సీ , ఎస్టీ , బిసి; డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సేవా సంఘం వ్యవస్థాపకులు జై భీమ్ నారమళ్ళ , పిట్టల సైదులు ముదిరాజ్ లు పాల్గొన్నారు .

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333