ఇనాం భూములల్లో పండించిన పత్తి పంటను CCI పత్తి కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు చేయకపోవడం సిగ్గుచేటు
గద్వాల్ జిల్లా ప్రజాసంఘాలు డిమాండ్.
జోగులాంబ గద్వాల 20 నవంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల పది సంవత్సరాల కాలంగా DS పెండింగ్లో ఉన్న కొన్ని వందల ఎకరాలలో రైతుల ఇనాం భూములు. నేటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఇనాం భూముల రైతులకు పరిష్కార మార్గం చూపించి దగ్గరుండి రైతులకు ORC లు జారీ చేయాలి. ఇనాం భూములలో పండించిన పత్తి పంటను అమ్ముకోవడానికి సిసిఐ కేంద్రాలలో ప్రభుత్వం అవకాశం కల్పించాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు ఇనాం భూములు పట్టా భూములే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి -kcr ముఖ్యమంత్రి అయిన తర్వాతే గుర్తింపులేని ఇనాం భూములుగా మిగిలిపోయాయి.
ఈరోజు గద్వాల్ జిల్లా కేంద్రంలో తెలంగాణ జన సమితి కార్యాలయంలో జిల్లా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇనాం భూముల తీవ్ర రైతుల సమస్య గురించి ప్రజాసంఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. ఈసందర్బంగా ప్రజా సంఘాలు మాట్లాడుతూ KCR తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కెసిఆర్ ముఖ్యమంత్రి అయినతర్వాత రైతుల భూములు రకరకాల ఇనాం భూములుగా DS పెండింగ్ పెట్టారని రైతుల ఆవేదనను ప్రజాసంఘాల నాయకులు ప్రస్థావించారు.రైతుల ముత్తాతల/తాతల కాలం నుండి భూములు దున్నుతూ సేద్యం చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు ఇనాం భూములు పట్టాగానే పరిగణించబడ్డాయి. ఆ పట్టా పాస్ పుస్తకాల ప్రకారమే బ్యాంకులలో రుణాలు కూడా తీసుకోవడం జరిగేది.తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కెసిఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ చట్ట ప్రకారమో తెలియదు ఏ నియమ నిబంధనల ప్రకారమో తెలియదు కాని 10 సంవత్సరాల (దశాబ్ద) కాలం పాటు భూములు నేటికీ డీఎస్ పెండింగ్ లో ఉంటూ ఇనాములుగానే మిగిలిపోయాయి. ఆ ఇనాం భూములలో పండించిన పత్తి పంటను నేడు సీసీఐ కొనుగోలు కేంద్రాలలో అమ్ముకోవడానికి వీలు లేకుండా పోయింది.అటు భూముల వివరాలు ఆన్లైన్ లో చూపించక నేడు పత్తి అమ్ముకోవడానికి స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి వెళ్తే ఇనాం భూములు అని రికార్డులో చూపించడం లేదు. ఈ కారణంగా ఇనాము భూములలో పండించిన పత్తి పంటను మధ్య దళారులకు తక్కువ ధరలకు అమ్ముకొని ఇనాం భూముల రైతులము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారన్నారు కావున ఇనాం భూములలో పత్తి పండించిన రైతులకు ఏదో రకంగా ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా వెసులుబాటు కల్పించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయని ఈ సమస్యని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించేందుకు కృషి చేయాలని డిమాండ్ చేశాయి. ఈ కార్యక్రమంలో TJS జిల్లా అధ్యక్షుడు ఆలూరు ప్రకాష్ గౌడ్. తెలంగాణ రైతాంగ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి గోపాల్. TPF సంకర ప్రభాకర్. CPM రైతు సంఘం నాయకుడు సంకాపురం మల్లేష్. BKMU జిల్లా అధ్యక్షుడు సాతర్ల ఆశన్న. సిపిఐ రైతు సంఘం నాయకుడు కామ్రేడ్ రంగన్న(ఎల్కూర్). ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.