ఆర్థిక సాయం అందజేత"ఆర్యవైశ్య విద్యార్థికి

Dec 25, 2024 - 18:21
Dec 25, 2024 - 19:00
 0  91
ఆర్థిక సాయం అందజేత"ఆర్యవైశ్య విద్యార్థికి

తెలంగాణ వార్త ప్రతినిధి పాలేరు :- నేలకొండపల్లివర్తక సంఘము మాజీ అధ్యక్షులు యర్రా సరస్వతి నాగేశ్వరరావు గార్ల దంపతుల 38వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా నేలకొండపల్లి మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన ఆర్యవైశ్య నిరుపేద విద్యార్థిని కేశ సత్యనారాయణ గారి కుమార్తె నవ్య హైదరాబాద్ జేఎన్టీయూలో బీఫార్మసీ చదువుతున్నది హాస్టల్ ఫీజు నిమిత్తం యర్రా నాగేశ్వరావు గార్ల దంపతులు 5000 డిసిసిబి బ్యాంక్ డైరెక్టర్ డాక్టర్ నాగు బండి శ్రీనివాసరావు గారు 5000 మొత్తం పదివేల రూపాయలు నెలకొండపల్లి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సంతోష్ గారి చేతుల మీదుగా వారికి చిరు ఆర్థిక సాయం చేయడం జరిగినది సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వారు మాట్లాడుతూ ఒక పేద విద్యార్థినికి చదువు కోసం ఆర్థిక విరాళం అందించటం సంతోషకరం ప్రతి ఒక్కరూ ఇలా మీరు ఏదైనా కార్యక్రమం చేసే సమయంలో నిరుపేదలకి చేతనేనంత సహాయం చేయటం వలన ఒక కుటుంబానికి ఆదుకున్న వాళ్ళమవుతాము వాళ్ల భారం కొద్దిగా నైనా తగ్గుతుంది ఇలాంటి స్ఫూర్తితో వాళ్లు చదువుకొని ఒక మంచి పొజిషన్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబాన్ని వారు పోషించుకునే స్థాయికి వెళ్తారు మీ ఆర్యవైశ్యులు ఇలాంటి మంచి సేవా కార్యక్రమాలు మునుముందు మరెన్నో చేయాలని వర్తక్షంగా సభ్యులకు ఆర్యవైశ్యులకు మరియు ఎర్ర నాగేశ్వరావు గారి దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య మండల అధ్యక్షులు దోసపాటి చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షులు రే గూరి హనుమంతరావు, డిసిసిబి ఖమ్మం డైరెక్టర్ డాక్టర్ నాగు బండి శ్రీనివాసరావు, తెల్లాకుల అశోక్ మాజీ అధ్యక్షులు కొత్త రమేష్, మేళ్లచెరువు సర్వేశ్వరరావు, ఎండూరి బ్రహ్మం, కొప్పు కృష్ణమూర్తి, గే ల్లా శ్రీధర్, భువనాసి మోహన్ రావు తెల్లాకుల వెంకటేశ్వరరావు కనుమలపూడి శ్రీధర్ కుటుంబ సభ్యులు ఆర్యవైశ్య సంఘ సభ్యులు పాల్గొని ఎర్ర నాగేశ్వరరావు సరస్వతి దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఇంత చక్కటి మంచి సేవా కార్యక్రమం చేసిన ఆ దంపతులను ఆశీర్వదించారు

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State