ఆర్థిక సహాయం అందజేత

Jul 19, 2025 - 20:38
 0  3
ఆర్థిక సహాయం అందజేత

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ ఆర్థిక సహాయం అందజేత. ఆత్మకూర్ మండల కేంద్రంలో గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతూ మృతి చెందిన బోళ్ల సరిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో శనివారం కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కాకి కృపాకర్ రెడ్డి ఆధ్వర్యంలో60 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా సరిత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో గొట్టిముక్కల శ్రీనివాస్ రెడ్డి, కొప్పుల శేఖర్ రెడ్డి, మిర్యాల లింగ రెడ్డి, చల్ల శ్రీకాంత్ రెడ్డి, ములకలపల్లి కరుణాకర్, సటు జనార్దన్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.