కళ్లు చెదిరే జయలలిత ఆస్తులు

27 కిలోల బంగారం, వజ్రాభరణాలు, రత్నాలు, 601 కిలోల వెండి వస్తువులు, 10,000 చీరలు, 750 జతల పాదరక్షలు ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి తమిళనాడు దివంగత సీఎం జయలలితకు చెందిన ఆస్తులు, పత్రాలను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించిన బెంగళూరులోని కోర్టు అధికారులు
10,000 చీరలు, 750 జతల పాదరక్షలు, 27 కిలోల బంగారం, వజ్రాభరణాలు, రత్నాలు, 601 కిలోల వెండి వస్తువులు, 1,672 ఎకరాల వ్యవసాయ భూముల పత్రాలు, నివాసాలకు సంబంధించిన దస్తావేజులు, 8,376 పుస్తకాలు తదితరాలను తీసుకు వెళ్లేందుకు భారీ భద్రతతో ఆరు ట్రంకు పెట్టెలు తీసుకువచ్చిన అధికారులు
జయలలిత అక్రమార్జనకు సంబంధించిన కేసు 2004లో తమిళనాడు నుంచి కర్ణాటకకు బదిలీ అయినప్పుడు అక్కడ జప్తు చేసిన ఆస్తులు, పత్రాలను ఇక్కడికి తీసుకువచ్చి భద్రపరిచిన అధికారులు
ఆస్తుల విలువ కనీసం రూ.4,000 కోట్లుగా ఉండొచ్చని అనధికారికంగా తెలుస్తోంది