SSFP మైక్రో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్న ఐసిడిఎస్ ఆరోగ్య సిబ్బంది. 

Sep 13, 2024 - 19:50
 0  9
SSFP మైక్రో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్న ఐసిడిఎస్ ఆరోగ్య సిబ్బంది. 

జోగులాంబ గద్వాల 13 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- మల్దకల్.ప్రాజెక్ట్ పరిది లోని గట్టు మండలం లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో వైద్య ఆరోగ్య శాఖ మరియు మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ సమన్వయం తో సూపర్వైజరీ సప్లిమెంటరీ ఫీడింగ్ ప్రోగ్రామ్ (SSFP) లో భాగంగా మైక్రోలెవెల్ యాక్షన్ ప్లానింగ్ కోసం సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఇట్టి సమావేశానికి జిల్లా సంక్షేమ అధికారిని సుధారాణి , జిల్లా పోషణ్ అభియాన్ కోఆర్డినేటర్ కళ్యాణ్ రెడ్డి నీతి ఆయోగ్ జిల్లా కో ఆర్డినేటర్ అబ్జల్  డాక్టర్ రమేష్ , CDPO నాగరాణి పాల్గొన్నారు . ఆరోగ్య కేంద్రం పరిది లో గల గ్రామాల వారీగా సబ్ సెంటర్స్, పల్లె దవాఖానా లలో గల ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడి టీచర్లు, ఆశ కార్యకర్తలను కలిపి మ్యాపింగ్ చేస్తూ.. ప్రణాళికను సిద్ధం చేసుకుని.. అంగన్వాడీ టీచర్ల ద్వారా గుర్తించిన (0-5 సంవత్సరాల)  పోషకాహార లోపంగల SAM MAM ,SUW చిన్నారులను  ప్రతి బుధ , శని వారాల్లో నిర్వహించే VHSND  రోజుల్లో  ఆరోగ్య పరీక్షలు నిర్వహించుటకు యాక్షన్ ప్లాన్ చేయడం జరిగింది. ఈ ప్రణాళిక ను అనుసరించి ప్రతి బుధ ,శని వారాల్లో గుర్తించిన పిల్లలందరికి  ఇటు ఆరోగ్య పరంగా సేవలు మరియు రెఫరల్ సర్వీసెస్ అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి అని జిల్లా సంక్షేమ అధికారిని సుధారాణి  ఆరోగ్య సిబ్బంది తో చర్చించారు. మరియు Moh పోర్టల్ లో లాగిన్ లో ఆన్లైన్ డేటాను PHC డాక్టర్ గారు అప్డేట్ చేయాల్సి ఉంటుందనీ సూచించారు.
రెండు రోజుల్లో యాక్షన్ ప్లాన్ వివరాలు పూర్తి చేసి ఇస్తామని డాక్టర్  వివరించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333