ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన బైకు ఇద్దరికీ త్రీవ గాయాలు ఎస్సై వెంకట్ రెడ్డి

Apr 7, 2026 - 13:04
Apr 7, 2026 - 13:05
 0  170
ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన బైకు ఇద్దరికీ త్రీవ గాయాలు ఎస్సై వెంకట్ రెడ్డి

అడ్డగూడూరు 6 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలో కంచనపల్లి వలిగొండ తొర్రూరు రహదారిలో ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం టీఎస్ 23 ఎల్  7798 నెంబర్ గల బండి బలంగా ఢీ కొట్టిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని కాంచనపల్లి గ్రామ పంచాయితీ పరిధిలోని నూనె మిల్లు సమీపంలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలోని తొండ గ్రామానికి చెందిన వేల్పుల నర్సయ్య,అదే మండలంలోని జెట్ట తండాకు చెందిన సరిత సోమవారం మోత్కూరు మండలంలోని ఓ ఫంక్షన్ లో వంట చేసి తిరిగి వస్తుండగా కాంచనపల్లి వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. వీరిలో ఇరువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.. సంఘటన స్థలానికి పోలీసులు సిబ్బంది పరిశీలిస్తున్నట్లు ఎస్ఐ వెంకటరెడ్డి తెలిపారు.