అలంపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మద్దతు దారుల ఏకగ్రీవం

Dec 7, 2025 - 20:36
 0  31

 జోగులాంబ గద్వాల డిసెంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి: అయిజ మండలం లో గుడిదొడ్డి, రాజాపురం, కుర్వపల్లి, జడదొడ్డి , కిస్తాపురం ,గ్రామాల్లో టిటి సర్పంచులు టిటి దొడ్డి ఉప సర్పంచి ఏకగ్రీవ ఎన్నిక.

శాలువాతో సత్కరించి అభినందించిన ఎఐసిసి కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్

అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన పత్రిక సమావేశంలో సంపత్ కుమార్  మాట్లాడుతూ. 

కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పరిపాలన ప్రజలకు నచ్చి ఈరోజు ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్థులను గెలిపించుకుంటున్నారని మరియు కాంగ్రెస్ పార్టీ గత రెండు సంవత్సరంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అయినటువంటి ఇందిరమ్మ ఇండ్లు ఉచిత కరెంటు గ్యాస్ సబ్సిడీ రైతు బీమా రైతు భరోసా ఉచిత బస్సు రేషన్ కార్డులు అలాంటి మరెన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు అందుకున్నారని ఆయన అన్నారు. 

అలంపూర్ నియోజకవర్గంలో అభివృద్ధి కోసం వేణు సోంపురం చిన్న తాండ్రపాడు వరకు బిటి రోడ్డు నిర్మాణం కొరకు ప్రత్యేక జీవో తీసుకొచ్చామని మరియు దానితోపాటు ఉండవల్లి మండలం కంచిపాడు గ్రామంలో ఒక ప్రభుత్వ పాఠశాలకు కోటి రూపాయలు మంజూరు చేయించడం తన స్వగ్రామమైన చిన్నతండపాడు గ్రామంలో ఉన్న పాఠశాలకి కోటి రూపాయలు మంజూరు చేయించడం అంతేకాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలు నియోజకవర్గంలో ఇంకా అనేక చోట్ల బీటీ రోడ్లు సిసి రోడ్లు అంగన్వాడీ బిల్డింగులు గ్రామపంచాయతీ భవనాలు లాంటి వివిధ రకాల అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయని దురదృష్టవశాత్తు నేను ఓడిపోయినప్పటికీ నా అలంపూర్ ప్రజలను ఏనాడు ఓడిపోనివ్వనని సంపత్ కుమార్  అన్నారు. 

అలంపూర్ అభివృద్ధి కోసం అలంపూర్ శ్రేయస్సు కోసమే నేను నాటి నుంచి నేటి వరకు పోరాటం చేస్తున్నానని బిఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ లా మోసపూరిత మాటలు నమ్మి ప్రజలు ఆల్రెడీ ఒకసారి నష్టపోయారని మళ్ళీ స్థానిక ఎన్నికల్లో వాళ్ళ మాయమాటలు నమ్మి మోసపోయి వాళ్ళ గ్రామాలకు అభివృద్ధిని దూరం చేసుకోకూడదని చెప్పారు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్థులు గెలుపొందితే ఆ గ్రామాలకు సంపత్ కుమార్  రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి మరిన్ని నిధులు తీసుకొస్తానని అన్నారు. 

తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు డిగ్రీ కళాశాల ఏర్పాటు కోసం తాను చేసిన కృషి అంతా కాదని విద్య వ్యవస్థను అట్టడుగు స్థాయి వాళ్లకు కూడా అందాలని ఆనాడు డిగ్రీ కళాశాలను ఏడు రెసిడెన్షియల్ స్కూళ్లను మరియు బీసీ హాస్టల్ ని తీసుకురావడం జరిగిందని విద్యావ్యవస్థను పటిష్టం చేయడానికి చదువుకున్నవాడిగా నేను చాలా కృషి చేశానని ఇంకా చేస్తాను అని సంపత్ కుమార్ తెలిపారు

 ఈ  కార్యక్రమంలో వీరి వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డప్ప ఐజా మండల అధ్యక్షులు కురువ జయన్న మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్షావలి ఆచారి కాంగ్రెస్ పార్టీ నాయకులు సంకపురం రాముడు, మద్దిలేటి దేవేంద్ర తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333