అర్హులైన ప్రతి పౌరునికి ఓటరుగా నమోదు

Jan 3, 2026 - 23:01
 0  3

పత్రికా ప్రకటన తెలంగాణ వార్త, సూర్యాపేట, 3-1-26:

    ప్రత్యేక విస్తృత సవరణ (ఎస్ ఐ ఆర్ -స్పెషల్ ఇంటెన్షివ్ రివిజన్ ) వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు

        హైదరాబాద్ నుండి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై అన్ని జిల్లాల కలెక్టర్లతో తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి శనివారం వీడియో కాన్ఫి రెన్స్ ద్వారా సమీక్షిస్తూ ప్రత్యేక విస్తృత సవరణ పురోగతి త

క్కువ ఉందని, లక్ష్యాన్ని ఎంచుకొన్ని పని చేయాలని ప్రతి సూపర్ వైజర్ తమ పరిధిలోని బి ఎల్ ఓ లు ప్రతి రోజు 30 నుండి 40 ఎంట్రీస్ చేయాలని, హౌజ్ టూ హౌజ్ డేటా వెరిఫికేషన్ చేయాలన్నారు.   అనంతరం జిల్లాలోని ఈ ఆర్ ఓ లు,ఏ ఈ ఆర్ ఓ లతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫి రెన్స్ నిర్వహించి

స్పెషల్ ఇంటెన్షివ్ రివిజన్ కార్యక్రమం ద్వారా ఓటరు జాబితాను పూర్తిగా పరిశీలించి,అర్హులైన ప్రతి పౌరుని ఓటరుగా నమోదు చేయడం,

మరణించిన వారు, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లను తొలగించడం,

ద్వంద్వ నమోదులను గుర్తించి సరిదిద్దడం,పేరు, చిరునామా, వయస్సు వంటి వివరాల్లో ఉన్న తప్పులను సవరించడం, ఫొటోలలో తప్పులను 

సరిచేయడం జరుగుతుందని తెలిపారు.ఓటరు జాబితా సవరణకు సంబంధించి బూత్ లెవల్ అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించి అవసరమైన వివరాలను సేకరించాలని అలాగే బి ఎల్ ఓ లకు ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని ఆదేశించారు.

  భూ భారతి దరఖాస్తులు, ప్రజావాణి దరఖాస్తులు త్వరగతిన పరిష్కరించాలని కుల ఆదాయం లాంటి సర్టిపికెట్స్ ఆలస్యం చేయకుండా వెంటనే జారీ చేయాలని ఆదేశించారు.

ఈ వీడియో కాన్ఫి రెన్స్ కు అదనపు కలెక్టర్ కే సీతారామారావు, ఆర్డీఓ వేణు మాధవ్, శిక్షణ డిప్యుటీ కలెక్టర్లు రవితేజ, అనూష,తహసీల్దార్ కృష్ణయ్య,సూపరింటిండెంట్లు సంతోష్ కుమార్, శ్రీలత రెడ్డి, సిబ్బంది తదితరులు హాజరయ్యారు

జారీ చేసిన వారు, జిల్లా పౌర సంబంధాల అధికారి, సూర్యాపేట.

Santosh chakravarthy తెలంగాణ వార్త సీనియర్ జర్నలిస్టు