అయ్యా ఉన్నతాధికారులారా ...ఆదుకోండి మహాప్రబో

Nov 23, 2025 - 04:23
 0  512
అయ్యా ఉన్నతాధికారులారా ...ఆదుకోండి మహాప్రబో

  తిరుమలగిరి 23 నవంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:

తిరుమలగిరి మండల కేంద్రంలోని తొండ గ్రామ శివారులో, హైవే రోడ్డు ప్రక్కన రైతు వేదిక దగ్గర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాలేజీ నిర్మించుట కొరకు 98/2  గల నిరుపేద బైరెడ్డి సుదర్శన్ రెడ్డి కి 1992లో పట్టా పాస్ బుక్ ప్రభుత్వం అతనికి అందజేసింది, బి ఆర్ఎస్ ప్రభుత్వంలో మూడు ఎకరాలకు,రైతుబంధు కూడా వచ్చేది ప్రస్తుత పరిస్థితులలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇంటిగ్రేటెడ్ కాలేజీ నిర్మించుట కొరకు ప్రభుత్వం తీసుకుని యున్నది, గత 20 సంవత్సరాల నుంచి ఆ భూమిపై పంట వేసుకుని జీవనోపాధి పొందుతున్న సుదర్శన్ రెడ్డికి,ఆర్థిక సాయం కానీ వేరే వద్ద మూడు ఎకరాల భూమిని ఆ పేద రైతుకు అందజేస్తే  కుటుంబం జీవనోపాధి ఉంటుంది,రైతు సుదర్శన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు, ప్రజల అవసరాల కోసం గత ప్రభుత్వంలో అందజేసిన భూములను అక్రమంగా తీసుకోవడం పేద బలహీన వర్గాలను దెబ్బతీయటమేనని వారికి , మరి ఎక్కడైనా మూడెకరాల స్థలానికి చూపించాలని వారు ప్రభుత్వాన్ని పలు దఫాలుగా కోరుచున్నారు, తొండ రైతు వేదిక దగ్గర ఉన్న భూమి బాధితుడు, బైరెడ్డి సుదర్శన్ రెడ్డికి,ఏదో ఒక ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు..... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి