బొట్టు పెట్టి మహిళలకు చీరలు పంపిణీ చేయాలి ఎమ్మెల్యే
పేదల పక్షపాతి ఇందిరాగాంధీ...
మహిళను గౌరవించే ఏకైక ప్రభుత్వం...
అన్నిట్లోనూ మహిళలకే ప్రాధాన్యం...
తిరుమలగిరి 23 నవంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండల కేంద్రంలో తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తుందని, వాటి ప్రయోజనం ఎన్నో కుటుంబాలకు ప్రయోజనం కలిగిస్తున్నది అభిప్రాయపడ్డారు. మండల కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని చీరల పంపిణీ చేశారు. మండల కేంద్రంలో పెద్ద సంఖ్యలో మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం అందించే చీరలను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మందుల సామేలు మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో పంపిణీ చేసిన చీరలు నాసిరకం, నాణ్యత లేకపోవడం వలన చాలా మంది మహిళలు వాడలేక మూలన పెట్టేసారని విమర్శించారు. అప్పటి చీరలు దిష్టిబొమ్మలకే ఉపయోగపడ్డాయని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల గౌరవం కాపాడేలా, మంచి నాణ్యత, ఆకర్షణ ఏమైనా రంగులతో ప్రభుత్వం అందిస్తుందని తెలియజేశారు. చీరలు అందుకున్న మహిళలు ఆనందం వ్యక్తం చేస్తూ, ఈసారి ఇచ్చిన చీరలు చాలా నచ్చాయని, నాణ్యత, రంగులు చాలా బాగున్నాయి అని అన్నారు. వీటిని పండుగలకు, ప్రత్యేక సందర్భాలకు ఉపయోగించుకుంటామని మహిళలు అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఎలుసోజు చామంతి ఎంపీడీవో లాజర్ తహసిల్దార్ హరిప్రసాద్ ఏపీఎం లక్ష్మి మండల స్పెషల్ ఆఫీసర్ రమేష్ బాబు పి టి ఓ యాదగిరి తాటిపాముల కవిత మండల పార్టీ అధ్యక్షులు ఎల్సోజు నరేష్ జొమిలాల్ కందుకూరి లక్ష్మయ్య వివిధ గ్రామ శాఖల అధ్యక్షులు పార్టీ కార్యకర్తలు అన్ని గ్రామాల కార్యదర్శి వివోలు మహిళా సంఘాలు తదితరులు పాల్గొన్నారు.