అయిజ మండల పరిధిలో వివిధ గ్రామాల కల్వర్టు బిడ్జిలను వెంటనే పూర్తి చేయాలి

బిజెపి ఐజ మండల అధ్యక్షులు గోపాలకృష్ణ,.
జోగులాంబ గద్వాల 30 ఆగస్టు 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఐజ బిజెపి మండల అధ్యక్షులు గోపాలకృష్ణ ఆధ్వర్యంలో అయిజ ఎమ్మార్వో జ్యోతికి వినతిపత్రం అందజేయడం జరిగింది. విషయం ఏమనగా అయిజ మండల పరిధిలో వివిధ గ్రామాలకు కల్వర్టు బ్రిడ్జ్ లనుగత పది సంవత్సరాల నుంచి కూడా ఏ ప్రభుత్వం ఇప్పు డున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏ ప్రజా నాయకులు కానీ పట్టించుకో వడం లేదు అందులో భాగంగా అయిజ నుండి మేడికొండ దారిలో ఉన్న పోలోన్ వాగుమరియు అయిజ నుండి ఉత్తనూరు టి టి దొడ్డి గ్రామాల మీదుగా పంచముఖి వెళ్లాలంటే ప్రజలు చిన్న వర్షాలు వచ్చినా రెండు మూడు రోజులు చాలా ఇబ్బంది అయిజ నుండి ఆంధ్రకు అయిజ నుండి కర్ణాటక కు పైన ఉన్న రహదారులన్నీ జాతీయ రహదారులుఈ దారి వెంట వెళ్లాలంటే వివిధ గ్రామ ల ప్రజలకు ప్రాణం మీదికి వస్తున్నది. ఎందుకంటే వర్షం వచ్చినా రోజు నుండి నాలుగు ఐదు రోజుల వరకు ఎలాంటి ప్రయాణానికి రాకపోకలకు చాలా ఇబ్బంది కరం ఈ రహదారి వెంట విద్యార్థులు విద్యకు మరియు ప్రజలు వైద్యానికి రావాలంటేచాలా ఇబ్బందికరంగా ఉన్నాయి మొన్న వచ్చిన వర్షాలకు ఒక పల్లెటూరు నుండి ఒక గర్భిణి తన ప్రసవం కోసం ఐజకు రావాల్సినటువంటి సమయంలో రాలేక ఆమె వచ్చిన వాహనం తిరిగి 40 కిలోమీటర్లుతిరిగి వచ్చినది మరి దీనిబట్టే అయిజ మండలంలో ఎలాంటి వాగులు ఉన్నాయి ఎలాంటి కల్వర్టు బ్రిడ్జిలు పూర్తికాలే దు అర్థం చేసుకోవాలి.
ఈ విధంగా ఉన్నట్టయితే ప్రజలకు తన నిత్య అవసరాలకు మరియు వ్యాపారాలను విద్య వైద్యం వీటన్నిటికీ చాలా దూరం అవుతున్నారు కాబట్టి ఈ పై సమస్యలన్నీటిని వెంటనే పరిష్కరించాలని భారతీయ జనతా పార్టీ నాయకులు డిమాండ్ చేయడం జరిగినది. లేనిపక్షంలో భవిష్యత్తులో కల్వర్టు బ్రిడ్జిల దగ్గర పెద్ద ఎత్తున ధర్నా రాస్తరోకలు చేస్తామని ఈ కార్యక్రమం ద్వారా తెలపడం జరిగినది.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు మేడికొండ భీమ్సేన్ రావు ఐజ పట్టణ ఉపాధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్, ఉప్పల ముదిరాజ్ శంకరన్న రాముడు భీసన్న మరియు తదితరులు పాల్గొన్నారు.