అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి సురేఖ
జోగులాంబ గద్వాల 29 సెప్టెంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి:-
ఐదో శక్తి పీఠం జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సోమవారం దర్శించుకున్నారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఆమె ప్రభుత్వం తరఫున జోగులాంబ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రికి దేవస్థానం చైర్మన్ కొంకల నాగేశ్వర్రెడ్డి, ఈవో దీప్తి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అలంపూర్ శాసనసభ్యుడు విజయ్యుడు పాల్గొని ప్రతేకంగా స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు అందించి, ఆశీర్వచన మండపంలో ఆమెను శేష వస్త్రంతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.