మానవత్వం చాటుకున్న తాసిల్దార్ శేషగిరి రావు,బాలెంల అరవింద్

May 12, 2025 - 19:49
 0  86

అడ్డగూడూరు 12 మే 2025 తెలంగాణవార్త రిపోర్టర్: - యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలో మంగమ్మగూడెం నుంచి రేపాక వెళ్లే మార్గ మధ్యలో కంప చెట్లకు నిప్పు పెట్టడం వల్ల అవి కాస్త కాళీ పక్కనే ఉన్నటువంటి వేప చెట్లకు అంటుకొని రోడ్డుకు మధ్యలో కూలింది.మంగమ్మగూడెం నుండి హైదరాబాద్ కి వెళ్తున్న గోసుల వీరయ్య తన భార్య ఉప్పమ్మా ల ఒక్కసారిగా ద్విచక్ర వాహనం మీద పడటం తో వారు అందులోనే చిక్కుకున్నారు వారిని గమనించిన తాసిల్దార్ శేషగిరి రావు మరియు బాలెంల అరవింద్ అక్కడికి వెళ్లి వారిని అందులో నుండి తీసి ఎమన్నా దెబ్బలు తగిలాయా అని చూసీ వెంటనే తాసిల్దార్ ఆ భూమి యజమాని కి ఫోన్ చేసి ఇంకో సారి ఇలా చేయొద్దు ప్రమాదం తప్పింది ఇంకో సారి ఇ విధంగా ఎవరు అయినా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు. ఈ సంఘటన స్థలంలో సుతోజు సోమన్న,ఇటుకాలా క్రిష్ణ, నరేష్,గ్రామ పంచాయతీ సిబ్బంది ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333