అప్రోచ్ రోడ్డు కోసం ఎమ్మెల్యే విజయుడు కు విన్నతి
జోగులాంబ గద్వాల 9జనవరి 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : ఉండవెల్ల. స్టేజి దగ్గర (నేషనల్ హైవే అప్రోచ్ రోడ్డు) బస్టాపు, లైటింగ్ మరియు సర్వీస్ రోడ్డు ఏర్పాటుకు కృషి చేయాలని ఎమ్మెల్యే విజయుడు కు ఉండవెల్లి గ్రామ ప్రజలు విన్నతి పత్రం సమర్పించారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడు 44వ జాతీయ రహదారి ఉండవెల్లి స్టేజి దగ్గర అప్రోచ్ రోడ్డు లేకపోవడంతో యాక్సిడెంట్స్ జరిగి చాలా మంది చనిపోవడం జరుగుతుంది.
మా గ్రామం ఉండవెల్లి 2016వ సంవత్సరంలో నూతన మండలంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినది. అయితే మాకు నేషనల్ హైవే నుండి మా గ్రామంలోకి దారి కలదు. అక్కడ (నేషనల్ హైవే అప్రోచ్ దగ్గర) మా గ్రామం రోడ్డు దగ్గర వాహనములు ఆపడానికి సరైన బస్టాప్ లేదు. కావున ఉండవెల్లి స్టేజి నేషనల్ హైవే దగ్గర బస్టాప్ ఏర్పాటు చేసి, సర్వీస్ రోడ్డును ఏర్పాటు చేయగలరు. మరియు అక్కడ లైటింగ్ కూడా ఏర్పాటు చేయగలరు. అలా ఏర్పాటు చేయనందువల్ల గతంలో చాలా యాక్సిడెంట్లు జరిగాయి. ఇట్టి ప్రదేశాన్ని పోలీస్ వారు బ్లాక్ స్పాట్‌గా గుర్తించినారు. కావున మా గ్రామం మీదుగా దాదాపు 10 గ్రామాలు (ఉండవెల్లి, చిన్న ఆముదాలపాడు, కంచుపాడు, తక్కశిల, మిట్టపాడు, ప్రాగటూరు, శేరుపల్లి, మారమునగాల-1, 2) మరియు ఆలంపూర్ చౌరస్తాలోని మార్కెట్ యార్డుకు దాదాపు 20 గ్రామాలకు చెందిన రైతులు రాకపోకలు చేస్తారు. కావున మాకు బస్టాప్ & సర్వీస్ రోడ్డు మరియు లైటింగ్ ఏర్పాటు చేసి మాకు సహకరించగలరని ఎమ్మెల్యే ను ప్రజలు కోరారు.