అతివేగం ప్రమాదకరం జిల్లా ఎస్పీ

Nov 25, 2025 - 05:35
 0  211
అతివేగం ప్రమాదకరం జిల్లా ఎస్పీ

తిరుమలగిరి 25 నవంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్

తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో రోడ్డు ప్రమాద స్థలాలను జిల్లా ఎస్పీ నర్సింహా ఐపీఎస్ ఫైనాన్స్ కమిషన్ సభ్యులు సుధీర్ రెడ్డి, సూర్యాపేట డివిజన్ డిఎస్పి ప్రసన్నకుమార్, తిరుమలగిరి మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు. అరైవ్-ఎలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక ప్రణాళిక తయారు చేసే ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా ఎస్పీ తెలిపారు. సూర్యాపేట జనగామ రహదారిపై నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డుపై 22 మధ్యంతర ఓపెనింగ్ లు ఉన్నాయని వీటి ద్వారా ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, ఇతర వాహనాలు వేగంగా గా వచ్చే సమయంలో ప్రమాదాలు సంభవిస్తున్నాయని తెలిపారు. వీటి నివారణ కోసం మున్సిపాలిటీ మండల కేంద్రంలో ప్రత్యేక రోడ్డు నివారణ కమిటీలను ఏర్పాటు చేస్తామని ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లి ప్రమాదాలను నివారిస్తామని సూచించారు. ప్రత్యేక చర్యలు తీసుకుని పట్టణంలో వేగ నియంత్రణను పాటించేలా నిబంధనలు అమలు చేస్తామని అన్నారు. ప్రజలు వాహనదారులు ప్రయాణ సమయంలో జాగ్రత్త తీసుకోవాలని ప్రతి ఒక్కరు సురక్షితంగా గమ్యం చేరుకోవాలని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం రాష్ట్ర డిజిపి శ్రీ శివధర్ రెడ్డి అరైవ్ ఎలైవ్ అని అవగాహన కార్యక్రమాన్ని తీసుకొచ్చారని దీని ద్వారా ప్రజల్లో విస్తృతంగా రోడ్డు భద్రత పట్ల అవగాహన కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది ప్రజలు తదితరులు పాల్గొన్నారు

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి