అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తులు ఆహ్వాన్నాం జిల్లా ఇంటర్మీడియట్ విద్య నోడల్ అధికారి
ఎం హృదయ రాజు
జోగులాంబ గద్వాల 19 జూలై 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- మల్దకల్. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జంతుశాస్త్రం అతిథి అధ్యాపకులుగా పనిచేయడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్య నోడల్ ఆఫీసర్ శ్రీ యం హృదయ రాజు పత్రికా ముఖంగా తెలిపారు. దరఖాస్తు చేసే అభ్యర్థులు పోస్ట్ గ్రాడ్యుయేషన్ జంతు శాస్త్రంలో చేసి ఉండి 50 శాతం పైన మార్కులు పొంది ఉండాలని తెలిపారు. దరఖాస్తులను ఇంటర్మీడియట్ విద్యా నోడల్ ఆఫీసర్ కార్యాలయం(కోట), గద్వాలలో తేదీ 22-7-2024 లోపు అనగా సోమవారం సాయంత్రం ఐదు గంటల లోపు సమర్పించాలని కోరడమైనది.