సైబర్ నేరాలపై శిక్షణ తరగతులు

Jul 18, 2024 - 20:26
 0  5
సైబర్ నేరాలపై శిక్షణ తరగతులు
సైబర్ నేరాలపై శిక్షణ తరగతులు

జోగులాంబ గద్వాల 19 జూలై 2024 తెలంగాణ వార్త  ప్రతినిధి:- ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్గాలలో జరుగుతున్న సైబర్ నేరాల పట్ల సైబర్ వారియర్స్ అప్డేట్ అవుతు , వీలైనంత  తక్కువ కాలంలో సైబర్ నేరాలకు గురైన బాధితులకు ఫ్రిజ్ అయిన డబ్బులను అందించగలగాలి  ఆని సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్స్పెక్టర్ రాజు   సైబర్ వారియర్స్ కు సూచించారు.జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు ఆదేశాల మేరకు జిల్లా లోని పోలీస్ స్టేషన్ ల వారిగా, సర్కిల్ కార్యాలయాల వారిగా ఉన్న సైబర్ వారియర్స్ కు గురువారం జిల్లా పోలీస్ కార్యాలయం లోని సమావేశ హాల్ నందు కొత్త కొత్త మార్గాలలో జరుగుతున్న సైబర్ నేరాల గురించి , సైబర్ నేరాలకు బాధితులు గురైనప్పుడు ఇన్ టైం లో ఆన్లైన్ లో పిర్యాదు చేసే విధానం, కేసు నమోదు అనంతరం కేసును ఇన్వెస్టిగేషన్ చేసే విధానం గురించి, బాధితులకు తిరిగి డబ్బుల రికవరీ చెయ్యడం గురించి శిక్షణ తరగతులు నిర్వహించారు.

     ఈ సందర్బంగా ఇన్స్పెక్టర్ సైబర్ నేరాలకు సంబంధించిన పిర్యాదులు వచ్చినప్పుడు NCRP పోర్టల్ ఆన్లైన్ లో పిర్యాదు చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, FIR నమోదు చేసే క్రమం లో పొందూరపాచాల్సిన అంశాల గురించి సైబర్ వారియర్స్ కు వివరించారు.సైబర్ నేరగాళ్ల అకౌంట్స్ ఫ్రిజ్ చేసి కోర్టు అనుమతుల ద్వారా ఫ్రీజ్ అయిన అమౌంట్ ను బాధితులకు అందజేసే విధానంను వివరించారు. కొత్త కొత్త పోకడలతో సైబర్ నేరగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారు అని , వాటి పై ప్రజలకు అవగహన కల్పించాలని అన్నారు. ఎవరైన సైబర్ నేరాలకు గురైతే 24 గంటలలో టోల్ ఫ్రీ నం 1930 కు సమచారం ఇవ్వడం పై ప్రజలను చైతన్యం చెయ్యాలని అన్నారు.  
ఈ కార్యక్రమంలో జిల్లా లోని పోలీస్ స్టేషన్ లలో ఉన్న సైబర్ వారియర్స్, సర్కిల్ కార్యాలయాల సైబర్ వారియర్స్ పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333