అణిచివేతలు ఆటంకాలు

పుట్టుకతో పుణ్యం రాదు
పుట్టగానే పువ్వు పరిమళించదు
మొగ్గ వేయగానే పండు కాదు
ఏదీ ఏమిటో తెలియదు
మనిషి ఎదుగుదలకు
కుటుంబ పరిస్థితులు
పరిసర వాతావరణం
స్నేహితుల ప్రభావం ఉంటుంది
అరుదుగా కొందరు
మేధావులవుతారు
కాలజ్ఞానాన్ని భోదిస్తారు
గుర్తింంపు పొందుతారు
అది అదృష్టం, అనుభవం
స్వశక్తి, స్వయం కృషి
కాలం కలిసి వచ్చి
ప్రజలు బ్రహ్మరధం పడతారు
జీర్ణిoచుకోలేక కొందరు
కుట్రలు, కుతంత్రాలతో
వారి గతాన్ని ముందుపెట్టి
అణిచివేస్తు,ఆటంక పరుస్తారు
పుట్టిన ప్రతివారు
పుణ్యాత్ములు కారు
పువ్వు ఎండిపోవచ్చు
మొగ్గ రాలిపోవచ్చు
అన్నింటికీ తట్టుకొని
ప్రతికూలపరిస్థితితులను ఎదురుకొని, కలబడి నిలబడి
బ్రతికి బయట పడతారు కొందరు
నిజంగా సమస్య ఉంటే చర్చించి
సామరస్యంగ, సావధానంగ పరిష్కరించుకోవాలి
మంచితనాన్ని చాటుకోవాలి
అబండాలేసి, ఆధిపథ్యం చూపి
అణిచివేయాలనుకోవడం
మానవత్వ విలువలకు మచ్చగా
అసూయ, ద్వేషం కనబడుతుంది
సమస్య వుంటే
సకాలంలో స్పందించి
తప్పుచేసిన వారికి
శిక్ష వేస్తే (వేయిస్తే )బాగుండేది
ఈ ధోరణి మారాలి
మనిషిలోని మంచిని చూడాలి
చిన్నదానిని పెద్దదిగాచూడడం మాని , గరికపోస అంత విలువైన ఇవ్వాలి.
రచన.
కడెం. ధనంజయ
చిత్తలూర్